గూగుల్ ఫొటోస్ గురించి మనకు తెలియని వాళ్లు దాదాపుగా ఉండరు. మనం ఆండ్రాయిడ్ ఫోన్లో తీసిన అన్ని ఫొటోలను సేవ్ చేయడానికి గూగుల్ ఫొటోస్ బాగా యూజ్ అవుతాయి. గూగుల్ ప్లస్ సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఇది భాగం. అయితే గూగుల్ ఫొటోస్‌ను ఒక ప్రత్యేకమైన టూల్‌గా రూపొందించింది . గూగుల్ ఫొస్‌ను సింగిల్ ఫొటో వ్యీవర్‌గా తయారు చేసింది. పికాసా మాదిరిగానే ఇది ఫొటోస్ షేరింగ్ ఫ్లాట్‌ఫాం అన్నమాట. కానీ దీని గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి మరి అవేంటో చూద్దామా..
ఎలా పని చేస్తుందంటే..
గూగుల్ ఫొటోస్ మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ప్రైవసీతో పాటు ఎన్నో రకాల ఆప్షన్లు దీనిలో ఉన్నాయి. మీ డివైజ్‌లో ఉన్న అన్ని ఫొటోలను ఒకే చోట చూడటానికి... ఈ ఫొటోలను ఒక క్రమ పద్ధతిలో, కేటగిరి ప్రకారం పెట్టుకోవడానికి గూగుల్ ఫొటోస్ బాగా యూజ్ అవుతాయి. మీ ఫొటోలను బ్యాక్ అప్ చేసుకునే వరకు ఈ టూల్ మీకు యూజ్ అవుతుంది. మీరు మీ ఫోన్లో ఈ యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే మీ ఫొటోలను బ్యాక్ అప్ చేయాలా అని అడుగుతుంది. మీరు యాక్సెస్ ఇస్తే చాలు. క్లౌడ్‌లో కూడా ఆటోమెటిక్‌గా ఫొటోలను ఇది సేవ్ చేస్తుంది. ఒక వేళ బ్యాక్ అప్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే దీన్ని సాధారణ ఫొటో వ్యూయింగ్ యాప్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ప్రైవసీ ఎంతో..
ఫొటోలు అంటే మనకు మరుపురానివి. మరి వాటిని ఒక యాప్‌కు అప్పగిస్తున్నామంటే అవి ఎంత భద్రంగా ఉంటాయి. అందుకే ప్రైవసీ ఆప్షన్ గూగుల్ ఫొటోస్‌లో ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింట్లోనూ ఇది వర్క ఔట్ అవుతుంది. అంటే మీరు ఇందులో బ్యాక్ అప్ చేసే ఫొటోలు కేవలం మీకు మాత్రమే విజుబుల్‌గా ఉంటాయి. మీరు షేర్ చేస్తేనే మాత్రమే ఎవరికైనా కనబడతాయి. గూగుల్ ప్లస్‌లో అయినా ఎక్కడైనా కూడా మీరు ఫొటోలను షేర్ చేస్తేనే అవి మిగిలిన వాళ్లు చూడగలుగుతారు. అంతేకాక మీ బ్యాక్ అప్ ఫొటోలు ఎవరికీ కనబడవు. మీకు మాత్రమే ఆ ఆప్షన్ ఉంటుంది. ఇవి మిస్ యూజ్ అయ్యే అవకాశం లేదు.