ఇంటర్నెట్‌లో ఎక్కువ ఆదరణ ఉన్న సైట్లలో అగ్రస్థానంలో ఉన్న సైట్లలో గూగుల్, యూట్యూబ్ తొలి రెండు స్థానాల్లో ఉంటాయి. ఈ రెండింటికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ దిగ్గజం యూట్యూబ్ వినియోగదారులను ఆకట్టుకోవడానికి భిన్నమైన ప్రయత్నాలు చేస్తోంది. స్మార్టుఫోన్లలో మెసెజింగ్ యాప్‌ను ప్రవేశపెట్టాలని యూట్యూబ్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ యాప్ ద్వారా వీడియోలను పంపించుకోవడం మునుపటి కంటే చాలా సులభం కానుంది. ఐతే ఆరంభంలో కొన్ని వర్గాలకు మాత్రమే ఈ యాప్ అందుబాటులోకి రానుంది. యాపిల్ ఐ ఫోన్ లేదా కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే ఈ యూట్యూబ్ కొత్త యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయోగం సఫలం అయితే భవిష్యత్తులో అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ లభ్యం కానుంది. యూట్యూబ్ పాపులర్ వీడియో యాప్ ద్వారా ఇప్పటికే వినియోగదారులను ఆకట్టుకున్న యూట్యూబ్ తాజా యాప్‌తో వారు తమ సైట్లో ఎక్కువసేపు సమయాన్ని వెచ్చించేలా చేయాలనేది యూట్యూబ్ వ్యూహం. ప్రస్తుతం ప్రస్తుతంం యూట్యూబ్ వీడియోలను షేర్ చేయాలంటే.. ఆ లింక్‌ను కాపీ చేసి వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పేస్ట్ చేస్తున్నారు. ఐతే ఈ యాప్‌తో ఇలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా షేర్ చేసే అవకాశం ఉంటుంది. ఐతే ఈ యాప్ ద్వారా వీడియోలను వీక్షిస్తున్న వారికి గూగుల్ యాడ్స్ అడ్డుపడుతుంటాయి. ఐతే ఇది గూగుల్‌కు ఎంతో ఉపయోగం. ఇప్పటిదాకా ఒక బిలియన్ మంది వినియోగదారులు ఈ యాడ్స్‌తో కూడిన వీడియోలు చూశారు. ఫేస్‌బుక్ ఓనర్‌గా ఉన్న వాట్సప్‌కు 100 కోట్ల మంది యూజర్లు ఉంటే.. యూట్యూబ్ మెసెంజర్ యాప్‌కు 900 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. స్నాప్‌చాట్‌కు 100 మిలియన్ యూజర్లు ఉన్నారు. కానీ మిగిలిన యాప్‌లతో పోల్చుకుంటే దీనికి వేగంగా ఆదరణ పెరుగుతోంది. |