• తాజా వార్తలు

ఇప్పటికీ ఐవోఎస్‌లో లేని ఆండ్రాయిడ్‌లో మాత్ర‌మే ఉన్న ఐదు ఫీచ‌ర్లు..

 

 

విండోస్ ఫోన్ల‌కు కూడా కాలం చెల్లిపోయింది.  ఇక ఆప‌రేటింగ్ సిస్టం బ‌రిలో మిగిలింది ఐవోస్‌ఆండ్రాయిడ్‌లే.  ఒక‌దానికి ఒక‌టి కాంపిటీష‌న్ కాక‌పోయినా ఫీచ‌ర్ల విష‌యంలో యూజ‌ర్ల‌కు ఇంచుమించుగా అవే ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తుంటాయి.  యాప్స్ కూడా అలాగే అప్‌డేట్స్ ఇస్తుంటాయి. కానీ ఎంత  ద‌గ్గ‌ర‌గా అనిపించినా ఆండ్రాయిడ్‌కు, ఐవోఎస్‌కు చాలా తేడాలే క‌నిపిస్తాయి. ఆండ్రాయిడ్‌లో ఉండి ఐవోఎస్‌లో లేని కొన్ని ఫీచ‌ర్లు ఇవీ..

1. యాప్ డిఫాల్ట్స్

మ‌నం ఐవోఎస్‌లో ఏదో ఒక మ్యాప్ కోసం లేదా ఓ యాప్ లో ఏదైనా యాక్ష‌న్ కోసం దాన్ని క్లిక్ చేస్తే అది నేరుగా ఓపెన్ కాదు.  ఐవోఎస్ సైట్‌కు వెళ్లి అక్క‌డి నుంచి ఓపెన్ అవుతుంది.  వాట్స‌ప్‌లో షేర్ అయిన లొకేష‌న్ లింక్‌ను ఓపెన్ చేస్తే అది సఫారీ, యాపిల్ మ్యాప్‌లోనే ఓపెన్ అవుతుంది. అంతే త‌ప్ప మ‌న‌కు న‌చ్చిన థ‌ర్డ్ ఫార‌పార్టీ యాప్ లో ఓపెన్ కాదు. అదే ఆండ్రాయిడ్‌లో అయితే మీరు ఏదైనా యాక్ష‌న్‌ను స్పెసిఫిక్  యాప్‌లో ఓపెన్ చేయాలంటే ఆ యాప్ తో నేరుగా ఓపెన్ అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఓ అడ్ర‌స్‌ను గూగుల్ మ్యాప్స్‌కు బ‌దులు Waze లో ఓపెన్ చేయాల‌నుకుంటే చేసుకోవ‌చ్చు. గూగుల్ క్రోమ్ బదులు ఒపెరా బ్రౌజ‌ర్ కావాలంటే నేరుగా  వాడుకోవ‌చ్చు.

2. అడ్వాన్స్‌డ్ నోటిఫికేష‌న్ కంట్రోల్స్

ఐవోఎస్‌లో ఒక నోటిఫికేష‌న్ సెంట‌ర్ (అంటే ఒక యాప్ లేదా సాఫ్ట్ వేర్ ) నుంచి వ‌చ్చిన నోటిఫికేష‌న్లు ఎన్ని ఉంటే అన్నీ స్క్రీన్‌పైన క‌నిపిస్తాయి. అదే ఆండ్రాయిడ్‌లో ఒక దానికి సంబంధించిన నోటిఫికేష‌న్ల‌న్నీ ఒక ఫోల్డ‌ర్‌లా అమ‌రి ఉంటాయి. ఆ నోటిఫికేష‌న్ ఐకాన్ ను టాప్ చేస్తే దానిలో ఉన్న నోటిఫికేష‌న్ల‌న్నీ క‌నిపిస్తాయి.

ఐవోఎస్‌లో నోటిఫికేష‌న్‌ను డిస్మిస్ చేయాలంటే రెండు స్టెప్‌ల ప్రాసెస్ ఉంటుంది. నోటిఫికేష‌న్‌ను లెఫ్ట్ లేదా రైట్‌కు స్వైప్ చేసి త‌ర్వాత క్లియ‌ర్ బ‌ట‌న్‌ను టాప్ చేయాలి. ఆండ్రాయిడ్‌లో అయితే ఒక్క‌సారి లాంగ్ స్వైప్ చేస్తే నోటిఫికేష‌న్ డిస్మిస్ అయిపోతుంది.

* ఆండ్రాయిడ్‌లో అయితే priority నోటిఫికేష‌న్స్‌ను కూడా సెట్ చేసుకోవ‌చ్చు.  ఏదైనా యాప్‌ను మీరు priority అని మార్క్ చేస్తే మీరు డు నాట్ డిస్ట్ర‌బ్ మోడ్ సెలెక్ట్ చేసినా  ఆ యాప్ నుంచి నోటిఫికేష‌న్లు  పొంద‌వ‌చ్చు.

 

3. ఆన్ డివైస్ కాల్ రికార్డింగ్‌

 కాల్ రికార్డ్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్‌లో ఎలాంటి థ‌ర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్‌నైనా వాడుకోవ‌చ్చు. అయితే కాల్  రికార్డింగ్ మీద కొన్ని లీగల్ ఇంప్లికేష‌న్స్ ఉన్నాయి. షియోమి లాంటి కొన్ని కంపెనీల‌యితే డ‌య‌ల‌ర్ యాప్‌లోనే రికార్డింగ్ ఆప్ష‌న్‌ను ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేశాయి.

ఐవోఎస్‌లో కూడా కాల్ రికార్డింగ్ యాప్‌లు ఉన్నాయి. అయితే వీటిలో చాలా వ‌ర‌కు త్రీవే కాల్ కాన్ఫ‌రెన్సింగ్  ఫెసిలిటీ అవ‌స‌ర‌మైన యాప్‌లే.  మ‌రికొన్ని VOIP-based call-back systemను ఉప‌యోగించుకుంటాయి. వీటిలో ప్ర‌తి రికార్డింగ్‌కు కొంత ఛార్జి ప‌డుతుంది.

 

4. మ‌ల్టీ యూజ‌ర్ మోడ్

 ఇంట్లో ఉన్న వాళ్లంతా ఒక‌టే ఫోన్ వాడుకోగ‌లిగే  మ‌ల్టీ యూజ‌ర్ మోడ్  ఆండ్రాయిడ్ 5 లాలీపాప్ ఓఎస్ నుంచే అందుబాటులోకి వ‌చ్చింది.  మీ విండోస్ పీసీ లేదా మ్యాక్ లాగే మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను కూడా డిఫ‌రెంట్ యూజ‌ర్ నేమ్ పాస్‌వ‌ర్డ్‌ల‌తో ఎక్కువ మంది వాడుకోవ‌చ్చు.  టెంప‌ర‌రీ  యూజ్‌కు గెస్ట్ మోడ్ కూడా ఉంది. ఏ యూజ‌ర్ నేమ్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అయితే వాళ్ల ఇన్ఫో యాక్స‌స్ చేయ‌వ‌చ్చు. ఐవోఎస్ లో  ఐ ఫోన్ల‌లో మాత్ర‌మే కాదు.. ఐ ప్యాడ్‌లో కూడా ఈ ఫీచ‌ర్ లేదు.

5. మ‌ల్టీ విండో యాప్స్

ఆండ్రాయిడ్ నూగ‌ట్ 7.0 ఓఎస్ నుంచి చాలా ఆండ్రాయిడ్ ఫో్న్ల‌లో ముఖ్యంగా శాంసంగ్ ఫోన్ల‌లో స్ప్లిట్ స్క్రీన్ మ‌ల్టీ టాస్కింగ్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. దీంతో మీరు ఒకే స్క్రీన్ మీద ఒకేసారి రెండు యాప్‌ల‌ను ప‌క్క‌ప‌క్క‌న ఓపెన్ చేసి వాడుకోవ‌చ్చు.  అయితే ఐ ఫోన్ యూజ‌ర్ల‌కు ఈ ఫీచ‌ర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

 

జన రంజకమైన వార్తలు