ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ కంపెనీ గత ఆగస్టులో తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 వెర్షన్ రేస్ మొదలుపెట్టేసింది. మార్చి నెల వరకు ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో దీని షేర్ 2%మాత్రమే. కానీ ఒక్క నెలలో దాదాపు 5%కు చేరింది. కొత్తగా వచ్చే ఫోన్లన్నీ ఈ అప్‌డేట్‌కు అనువుగా వస్తున్నాయి కాబట్టి నౌగట్ ఆండ్రాయిడ్ ఫోన్లను మరింత స్పీడ్‌గా చేరిపోవడం ఖాయం.
ఆండ్రాయిడ్.. ఆపరేషన్ సిస్టమ్స్‌లో తిరుగులేని పేరు. స్మార్ట్‌ఫోన్లకు ఇదే గుండెకాయ. యాపిల్‌కు ఐవోఎస్, విండోస్ ఫోన్లలో విండోస్ ఓఎస్‌లున్నా 80 శాతం స్మార్ట్‌ఫోన్లు నడిచేది ఆండ్రాయిడ్ ఓఎస్‌తోనే. విండోస్ కంటే యూజర్ ఫ్రెండ్లీ కావడం, యాపిల్ ఐఓఎస్ మాదిరిగా కాస్ట్లీ కాకపోవడం ఆండ్రాయిడ్ సక్సెస్‌కు ప్రధాన కారణాలు. యూజర్లలో ఉన్న ఈ ఆదరణను నిలబెట్టుకోవడానికి ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎప్పటికప్పుడు కొత్త డెవలప్‌మెంట్స్‌తో, కొత్త కొత్త అప్‌డేట్స్‌తో ముందుకొస్తుంది. జింజర్ బ్రెడ్ నుంచి మొదలుపెట్టి ప్రస్తుత నోగట్ వరకు కొత్త కొత్త వెర్షన్లతో ఎప్పడూ టెక్నాలజీ పరంగా ముందుండే ప్రయత్నం చేస్తోంది. గత ఆగస్టులో అప్పటికే ఉన్న మార్ష్‌మాలో (6.0) వెర్షన్ కన్నా అప్‌డేటెడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ నౌగట్ (7.0)ను ప్రవేశపెట్టింది. తర్వాత 7.1తో నౌగట్‌కు కూడా అప్డేట్ తీసుకొచ్చింది.
నౌగట్‌కు ఆదరణ
గత ఆగస్టులో వచ్చినా మార్చి వరకు నౌగట్ స్పీడ్ అందుకోలేదు. అయితే ఆ తర్వాత బాగా వేగం పుంజుకొంది. ప్రస్తుతమున్న ఆండ్రాయిడ్ డివైస్‌ల్లో నౌగట్ 7.0, 7.1 వాడుతున్న వాటి సంఖ్య 5% కి చేరింది. నాలుగు నెలలుగా యూజర్లు అప్‌డేట్ చేసుకుంటున్న ఆండ్రాయిడ్ వెర్షన్ నౌగట్ ఒక్కటే. అంతకు ముందు వచ్చిన ఆండ్రాయిడ్ వెర్షన్లన్నీ ప్రస్తుతం డౌన్ ఫాల్ లో ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ మొత్తం ఆండ్రాయిడ్ డివైజ్‌లలో మార్షమాలో (31.2%) దే మేజర్ షేర్. దాని తర్వాత ప్లేస్ ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 వెర్షన్. దీన్ని వాడుతున్నవారు 23 %.