లేటెస్టుగా రిలీజైన యూనికోడ్ స్టాండర్డ్ 10.0 వెర్షన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో 56 కొత్త ఎమోజీలను కొత్తగా చేర్చారు. అంతేకాదు... 8518 కొత్త క్యారెక్టర్లు ఈ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
ఏమేం ఉన్నాయి...
డైనోసార్లు, బిట్‌కాయిన్ సింబల్, కోల్బర్ట్, ఫేస్ వామిటింగ్, స్టార్ స్టక్, వుమన్ విత్ హెడ్ స్కార్ఫ్, జోంబీ, వాంపైర్, జీబ్రా తదితర కొత్త ఎమోజీలు ఈ వెర్షన్‌లో ఉన్నాయి.
కొత్త స్మార్టు ఫోన్లలో ఇక ఇదే ఉండనుంది..
యూనికోడ్ స్టాండర్డ్ 10.0 వెర్షన్‌ను యాపిల్, గూగుల్, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తాము భవిష్యత్తులో విడుదల చేయబోయే నూతన డివైస్‌లలో అందివ్వనున్నాయి. యాపిల్ తన ఐఓఎస్ 11లో, గూగుల్ తన ఆండ్రాయిడ్ ఓ (O) ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ కొత్త వెర్షన్‌ను, అందులో ఉండే ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తేనున్నాయి.