ఆండ్రాయిడ్ నూగట్ 7.0 వెర్షన్ ఓఎస్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న షియోమి యూజర్ల నిరీక్ష ఫలించింది. ఏయే మోడల్ ఫోన్లకు నూగట్ అప్‌డేట్ ఇవ్వబోతున్నామో కంపెనీ అనౌన్స్ చేసింది. మొత్తం 14 షియోమి డివైస్‌లకు ఆండ్రాయిడ్ నూగట్ 7.0 ఓఎస్తో 7.1 అప్‌డేట్ కూడా వస్తుంది. అయితే రెడ్‌మీ నోట్ 4 మాత్రం ఈ లిస్ట్‌లో లేదు.
ఏయే ఫోన్లకు అప్‌డేట్ వస్తుంది?
* షియోమి రెడ్‌మీ 4X
* షియోమి ఎంఐ మ్యాక్స్
* ఎంఐ మ్యాక్స్2
* ఎంఐ నోట్ 2
* రెడ్‌మీ నోట్ 4X
* ఎంఐ మిక్స్
* ఎంఐ 5
* ఎంఐ 5s
* ఎంఐ 5ఎస్ ప్లస్
* ఎంఐ 6