కరోనా వైరస్ విజృంభించడంతో ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయితే అన్ని పనులూ ఇండివిడ్యువల్‌గా చేయలేరు కాబట్టి టీమ్ డెసిషన్స్ కోసం వీడియో కాల్స్ చేసుకుంటున్నారు. కొన్ని విద్యాసంస్థలు, కోచింగ్ ఇనిస్టిట్యూట్స్ కూడా తమ విద్యార్థులకు వీడియో కాల్స్ చేసి పాఠాలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి వాళ్లందరూ వీడియో కాలింగ్‌కు వాడుతున్న ఫ్లాట్‌ఫామ్స్ జూమ్, స్కైప్, గూగుల్ హ్యాంగవుట్
వంటివి వాడుతున్నారు. మీరు ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ఈ లిస్ట్‌లో వాట్సాప్ లేదు. సోషల్ మీడియాలో తిరుగులేని స్థానంలో ఉన్న వాట్సాప్ ఈ విషయంలో ఎందుకు వెనకబడింది? ఇప్పుడు దాన్ని ఎలా అధిగమించబోతోంది తెలుసుకోవాలంట ఈ ఆర్టికల్ చదవండి.
నలుగురికే ఛాన్స్
వాట్సాప్‌లో గ్రూప్ వీడియో కాల్స్ కేవలం నలుగురికే పరిమితం. వీడియో కాల్ క్వాలిటీ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. మిగతా యాప్స్‌లో చాలా ఎక్కువ మంది ఒకేసారి గ్రూప్ వీడియో కాల్స్‌లో పాల్గొనచ్చు. క్వాలిటీ కూడా బాగుంటుంది. జూమ్ యాప్‌లో ఒకేసారి 500 మందితో గ్రూప్ వీడియో కాల్ చేసుకోవచ్చు. అందుకే అంత హిట్టయింది.
\
పర్సన్స్‌ను పెంచబోతోందా?
అసలే లాక్‌డౌన్. జనం ఇంట్లో నుంచి బయటికి కదలకుండా గ్రూప్ వీడియో కాల్స్‌తో బంధుమిత్రులతో టచ్‌లో ఉంటున్నారు. ఇలాంటప్పుడు పూర్ ఫెర్‌ఫార్మెన్స్ ఉంటే మార్కెట్లో వెనకబడతామని వాట్సాప్ గ్రహించింది. అందుకే గ్రూప్ వీడియో కాల్స్‌లో పాల్గొనే వారి సంఖ్యను 4 నుంచి 6కు పెంచబోతోంది. ఇది 8, 10, 12 కూడా కావచ్చని వాట్సాప్ టీంలో కీలక సభ్యుడు ఒకాయన చెప్పారు. లాక్‌డౌన్ టైమ్‌లో తమ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చందుకు సాధ్యమైనంత త్వరలోనే అప్‌డేట్ ఇవ్వబోతోంది.