• తాజా వార్తలు

వాట్సాప్‌లో మెసేజ్‌ల‌తో విసిగిపోతున్నారా.. ఆటోమేటిగ్గా డిలెట్ అయ్యే ఫీచ‌ర్ వ‌చ్చేస్తోంది

వాట్సాప్ వ‌చ్చాక ఫార్వ‌ర్డ్ మెసేజ్‌లతో మ‌న‌కు విసుగొచ్చేస్తోంది.  ఫేక్ న్యూస్‌ను కంట్రోల్ చేయ‌డానికి ఫార్వర్డ్ మెసేజ్‌ల‌ను ఒక‌సారి ఐదుగురికి మాత్ర‌మే పంప‌గ‌లం. అయినా కూడా ఈ ఫార్వ‌ర్డ్ మెసేజ్‌ల జోరు త‌గ్గ‌ట్లేదు.  ముఖ్యంగా క‌రోనా వ‌చ్చాక హెల్త్‌టిప్స్‌, క‌రోనా రాకుండా జాగ్ర‌త్త‌లు వంటివైతే ర‌క‌ర‌కాల గ్రూప్స్‌, వ్య‌క్తుల నుంచి ప‌దే ప‌దే వ‌స్తున్నాయి.  చాలామంది ప్రెండ్స్ బంధువులుకూడా గుడ్ మార్నింగ్‌, గుడ్‌నైట్ మెసేజ్‌లు, పండ‌గ‌లకు విషెస్ మెసేజ్‌లు పంపిస్తుంటారు. ఈ ప‌రిస్థితుల్లో ఇలాంటి   మెసేజ్‌ల‌తో ఫోన్ మెమ‌రీ నిండిపోతుంది. ప్ర‌తిదాన్నీ చూసి డిలీట్ చేయ‌డం కూడా టైమ్ వేస్టే. అందుకే వీటిని ఆటో డిలీట్ చేయ‌డానికి వాట్సాప్ కొత్త ఫీచ‌ర్ తెస్తోంది. 

వాట్సాప్ డిజ‌ప్పియ‌రింగ్ మెసేజ్ ఫీచ‌ర్‌
వ్య‌క్తులు లేదా గ్రూప్‌ల నుంచి వ‌చ్చే మెసేజ్‌ల‌ను ఆటోమేటిగ్గా డిలెట్ చేసే వాట్సాప్ డిజప్పయిరింగ్ మెసేజ్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో ఎవ‌రి మెసేజ్‌లు మీరు ఆటో డిలీట్ చేసుకోవాలో మీరే సెట్ చేసుకోవ‌చ్చు. వారం రోజుల త‌ర్వాత ఆ మెసేజ్‌లు ఆటోమేటిగ్గా డిలీట్ అవుతాయి. దీనివల్ల ఫోన్ మెమ‌రీ నిండిపోదు. వాట్సాప్‌లో వ‌చ్చే వేస్ట్ మెసేజ్‌లు, గుడ్‌మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజ్‌లు అన్నీ ఆటో డిలెట్ అయిపోతే మీకూ మ‌న‌శ్శాంతి. 

ఒక్కొక్క‌టిగా మీరే సెలెక్ట్ చేసుకోవాలి
ప్ర‌స్తుతం ఈ డిజ‌ప్పియిరింగ్ మెసేజ్ ఫీచ‌ర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్‌, ఐవోఓస్‌, వెబ్ అన్ని ఫ్లాట్‌పామ్స్‌లోనూ ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఏ ప‌ర్స‌న్ లేదా గ్రూప్ మెసేజ్ ఆటో డిలెట్ చేయాల‌న్న‌ది ఫ‌స్ట్ టైమ్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న త‌ర్వాత ఆటోమేటిగ్గా వారం రోజుల త‌ర్వాత ఆ చాట్‌లో ఉన్న మెసేజ్‌ల‌న్నీ డిలెట్ అయిపోతాయి. |

జన రంజకమైన వార్తలు