ప్రపంచంలో అత్యధిక మందికి చేరువైన మెసేజింగ్ యాప్ ఏదంటే వాట్సాప్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. పెద్దగా చదువుకోనివాళ్లు కూడా వాడగలిగేలా ఈజీ ఇంటర్‌ఫేస్ దీనికి ఉన్న ప్లస్‌పాయింట్. వాట్సాప్ పుణ్యమా అని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్ కూడా గ్రూప్‌లు కట్టి నిత్యం పలకరించుకుంటున్నారు. సమాచారం తెలుసుకుంటున్నారు. ఇక వ్యక్తిగతంగా వచ్చే మెసేజ్‌లయితే బోల్డన్ని. వీటన్నింటికీ వెంటనే రిప్లై ఇవ్వడం బాగా బిజీగా ఉండేవాళ్లకు కుదరకపోవచ్చు. అలాంటి ఇబ్బందులు రాకుండా వాట్సాప్‌లో ఆటో రిప్లై ఫీచర్‌ను అనేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఫలానా టైమ్‌కు వాట్సాప్ మెసేజ్ పంపాలని దాన్ని షెడ్యూలింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి వాట్సాప్‌లో ఈ ఫీచర్లు లేవు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్లు వాడుకోవాలంటే వేరే యాప్స్‌డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఎలా పని చేస్తాయో చూడండి.
ఆటోరెస్పాండర్ ఫర్ వాట్సాప్
వాట్సాప్‌లో మెసేజ్‌ల కోసం ఆటో రిప్లై ఇవ్వడమే మెయిన్ ఫీచర్‌గా AutoResponder for WA యాప్ ఆగస్టులో రిలీజైంది. ఈ 8 నెలల్లోనే లక్షకు పైగా డౌన్‌లోడ్స్ సాధించింది. ఈజీ ఇంటర్‌ఫేస్‌తో ఎవరైనా సులువుగా వాడుకోవచ్చు.
1.AutoResponder for WA యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
2. Allను టాప్ చేసి మీరు పంపాలనుకుంటున్న మెసేజ్‌ను సెట్ చేయండి. అంటే గుడ్మాణింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్‌నైట్ ఇలా ఏదైనా సరే. అంతేకాదు అవతలి వ్యక్తి హలో అనగానే Hey! Whats up అని పక్కన ఆ పర్సన్ పేరు వచ్చేలా టెక్స్ట్ సెట్ చేసుకోవచ్చు.
3. ఇప్పుడు మీరు ఆటోరిప్లై ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ పేరును రిసీవర్‌గా యాడ్ చేయాలి. అయితే ఈ పేరు మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేమ్ అలాగే ఉండాలి. వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో నుంచి కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. ఎక్కువ మందికి ఇదే రిప్లై ఇవ్వాలనుకుంటే కాంటాక్ట్స్‌కు మధ్యలో కామా ఇచ్చి యాడ్ చేయండి. అయితే @, _ లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న గ్రూప్ నేమ్‌లకు ఆటో రిప్లైఫీచర్ పనిచేయదు.
4. అంటే మీ మెసేజ్ ఆటో రిప్లైగా సెట్ అయిపోయింది. టిక్ ఐకాన్ మీద టాప్ చేసి దాన్నిసేవ్‌చేయండి. అంతే ఇక మీకు అవతలి పర్సన్ నుంచి మెసేజ్ రాగానే ఆటోమేటిగ్గా రిప్లయి వెళ్లిపోతుంది. హలో, హాయ్ వంటి మెసేజ్‌లయితే డిఫాల్ట్‌గా యాపే పంపించేయగలదు.
SKEDitతో షెడ్యూలింగ్
రాత్రి ఎందుకు డిస్ట్రబ్ చేయడం..ఉదయం వాట్సాప్ మెసేజ్ చేద్దాం అనుకుని మర్చిపోయారా. ఇంపార్టెంట్ అయి ఇబ్బంది పడ్డారా? ఈ ఇబ్బంది తీర్చేస్తుంది SKEDit యాప్. ఇది మీ వాట్సాప్ మెసేజ్‌లు షెడ్యూల్‌చేసుకోవడానికి ఫర్పెక్ట్ యాప్. వాట్సాప్ ఒక్కటే కాదు ఈ మెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లో కూడా మెసేజ్‌లను దీనితో షెడ్యూలు చేసుకోవచ్చు.
1. SKEDit: Scheduling Appను డౌన్‌లోడ్ చేసుకోండి.
2. ఈ యాప్ మీ ఫోన్ యాక్సెసబిలిటీ పర్మిషన్లు అడుగుతుంది. వాటికి పర్మిషన్ ఇచ్చాక మీరు ఎవరికి మెసేజ్ షెడ్యూల్ చేసి పెట్టాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్‌ను సెలెక్ట్ చేసి మెసేజ్ రాసి, టైమ్ సెలెక్ట్ చేయండి.
3. Ask me before sending ఆప్షన్‌ను స్విచ్ ఆన్‌చేయండి. అప్పుడు మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపే ముందు యాప్ మీకు నోటిఫికేషన్ పంపిస్తుంది. మెసేజ్ సెండ్ చేయాలా అని అడుగుతుంది. మీరు సెండ్‌ను ఓకే చేస్తే మెసేజ్‌ను పంపేస్తుంది.
అయితే ఈ యాప్‌లో ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏమిటంటే ఇది పనిచేయాలంటే మీ ఫోన్‌కు ఎలాంటి లాక్స్ ఉండకూడదు. స్వైప్ అన్‌లాక్ మెథడ్ తప్ప పాస్వర్డ్, ప్యాట్రన్ లాక్స్ లాంటివి ఏవి ఉన్నా పనిచేయదు.