• తాజా వార్తలు

వాట్సప్‌లోకి  వాయిస్ ప్రివ్యూ మెసేజ్, అసలేంటిది, ఎలా పనిచేస్తుంది 

200 కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ను యూజర్లకి అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో కేవలం మెసేజ్‌లు ,ఫొటోలకు పరిమితమైన వాట్సప్ క్రమంగా తన పరిధిని పెంచుకుంటూ పోతుంది. వాయిస్‌ కాలింగ్‌, వీడియో కాలింగ్‌లతో పాటు డబ్బులు ట్రాన్సపర్‌ చేసుకునే సదుపాయం కూడా వినియోగదారులకు అందించింది. ఇలా రోజు రోజుకు పరిధిని పెంచుకున్న వాట్సప్ మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది.ఇందులో భాగంగా రికార్డింగ్‌ను పరిశీలించి, సరిచేసుకునే అవకాశం కల్పించనుంది. 

సాధారణంగా వాట్సప్‌లో వీడియో అయినా, టెక్ట్స్ మెసేజ్ అయినా, ఫార్వార్డ్ చేసే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. కానీ, షార్ట్ ఆడియో క్లిప్ రికార్డ్ చేసి వదలగానే అది వెళ్లిపోతుంది. దాన్ని పరిశీలించే అవకాశం ఉండదు.అందుకే ఒకసారి వాయిస్‌ రికార్డ్‌ చేసుకున్న తర్వాత దాన్ని విని ఓకే అనుకుంటే పంపించే ఆప్షన్‌ను తీసుకు వచ్చారు.  ఈ ఫీచర్ ద్వారా వాయిస్ సరిచేసుకుని పంపుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్‌లో బీటా దశలో వుందని.. అతి త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి రానుందని వాట్సప్ ప్రకటించింది.

ఇప్పటికే వాట్సప్ మెసేజ్ ను పంపిన తర్వాత కూడ నిర్ణీత సమయంలోగా డిలీట్ చేసే అవకాశం కల్పించింది వాట్సప్. మొత్తానికి వాట్సప్‌ నుండి వస్తున్న ఫీచర్స్‌ వినియోగదారులను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే  తమ ఇబ్బందులు తొలగడం ఖాయమని వాట్సప్ వినియోగదారులు అంటున్నారు.

ఫోటోలు, వీడియోలు రూపంలో వాట్సప్‌లో మనం షేర్‌ చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చేసుకునేందుకు వీలువతుందుని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్స్ యాప్ ద్వారా మెసేజ్‌లను షేర్‌ చేసే సమయంలో ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.మీ స్మార్ట్‌ఫోన్‌‍లోని వాట్స్ యాప్ సందేశాలను లాక్ చేయటం ద్వారా మీ వాట్స్ యాప్ అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకుగాను గూగుల్‌ప్లే స్టోర్‌లో వాట్స్ యాప్ లాక్ పేరుతో ఓ ఉచిత యాప్ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సందేశాలను లాక్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్ యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసిన సమయంలో కొన్నిసార్లు పాత సంభాషణలు మిస్ అవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి చాట్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని చాట్ సంభాషణ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే పాత సంభాషణలను తిరిగి పొందవచ్చు. అలాగే హ్యాకర్ల నుంచి వాట్స్‌యాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు మీ వై-ఫైకు పటిష్టమైన పాస్‌వర్డ్‌ను జత చేయండి.
 

జన రంజకమైన వార్తలు