• తాజా వార్తలు

వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు, ఎలా వాడాలో ప్రాసెస్ చూడండి 

ఫేస్‌బుక్ సొంత మెసేజింగ్ యాప్ వాట్సప్‌లోకి మరో 5 కొత్త ఫీచర్లు రానున్నాయి.2019 ఏడాది ఆరంభం నుంచి వాట్సప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీక్వెంట్లీ ఫార్వాడెడ్, ఫార్వాడింగ్ ఇన్ఫో, గ్రూపు కాలింగ్ షార్ట్ కట్, గ్రూపు వాయిస్, వీడియో కాల్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మరో ఐదు కొత్త ఫీచర్లపై వాట్సప్ వర్క్ చేస్తోంది. రానున్న నెలల్లో ఈ ఐదు కొత్త ఫీచర్లనుప్రవేశపెట్టనుంది. ఆ ఐదు కొత్త ఫీచర్లు ఏంటో చూద్దాం. 

డార్క్ మోడ్ : 
ఈ ఫీచర్ ఇప్పటికే ఇతర మెసేజింగ్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. త్వరలో వాట్సప్ లో కూడా డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉన్నందున వచ్చే కొన్ని నెలల్లో డార్క్ మోడ్ ఫీచర్ యూజర్లకు చేరువ కానుంది. 

హైడ్ మ్యూటెడ్ స్టేటస్ :  
మీ వాట్సప్ కాంటాక్టు లిస్టులో ప్రత్యేకంగా ఏ కాంటాక్ట్ యూజర్ స్టేటస్ అప్‌డేట్స్ అవసరం లేదంటే మ్యూట్ లేదా హైడ్ చేసుకోవచ్చు.ఈ హైడ్ బటన్.. Muted Updates సెక్షన్ లో చూడొచ్చు. Hide బటన్ పై ప్రెస్ చేస్తే చాలు.. ఆల్ మ్యూటెడ్ స్టేటస్ అప్ డేట్స్ హైడ్ అవుతాయి. పక్కనే Show బటన్ కూడా ఉంటుంది. హైడ్, మ్యూట్ చేసిన స్టేటస్ అప్ డేట్స్ తిరిగి కావాలంటే క్లిక్ చేయండి. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా అప్‌డేట్ 2.19.183 తో రానుంది.

ఫింగర్ ఫ్రింట్ లాక్ : 
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ఫ్రింట్ అన్ లాకింగ్ మెకానిజంపై వాట్సప్ వర్క్ చేస్తోంది. థర్డ్ పార్టీ లాకింగ్ యాప్స్ ద్వారా కొత్త ఆథరైజేషన్ మెథడ్ అవసరం కావొచ్చు. పాపులర్ Redundant యాప్స్ ఎట్రాక్టీవ్ గా ఉంటాయి. వాట్సప్ యూజర్లు తమ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఫింగర్ ఫ్రింట్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం Face Unlock ఫీచర్ ను కూడా తీసుకురావాలని చూస్తోంది. 

షేర్ వాట్సప్ స్టేటస్ : 
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, జీమెయిల్, గూగుల్ ఫొటోల నుంచి యూజర్ల స్టేటస్ ను షేర్ చేసుకోవచ్చు. డేటా షేరింగ్ API ద్వారా iOS, ఆండ్రాయిడ్ డివైజ్ ద్వారా యూజర్ల స్టేటస్ ను ట్రాన్ ఫర్ చేసుకోవచ్చు. అలాగే API టెక్నాలజీ ద్వారా యూజర్లు వాట్సాప్ స్టేటస్ ను ఇతర సోషల్ అకౌంట్లతో లింక్ చేయకుండానే షేర్ చేసుకోవచ్చు. అయితే సెక్యూరిటీ పరంగా వాట్సప్ నుంచి స్టేటస్ పోస్టులను నేరుగా షేర్ అవ్వవు. యూజర్ షేర్ చేయాలని భావిస్తే మాత్రమే స్టేటస్ పోస్టును షేరింగ్ చేసుకునే వీలు మాత్రమే ఉంటుంది.  

ర్యాంకింగ్ ఆఫ్ కాంటాక్ట్స్ :  
ఫేవరెట్ కాంటాక్టు లిస్టును ర్యాంకింగ్ ఆఫ్ కాంటాక్టులుగా సెట్ చేసుకోవచ్చు.ఆటోమాటిక్ గా మీ వాట్సప్ కాంటాక్టులు టాప్ లిస్టులో కనిపిస్తాయి. ఎవరి కాంటాక్ట్స్ వాట్సప్ లో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుందో వారి కాంటాక్టు ర్యాంకింగ్ టాప్ లిస్టులో ఉంటుంది.

జన రంజకమైన వార్తలు