ప్రముఖ ఇన్ స్టెంట్ మెసేంజింగ్ దిగ్గజం వాట్సప్ మరో సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అథంటికేషన్ ఫీచర్ ను యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సప్ బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్‌పై పరీక్షల అనంతరం ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం దీన్ని రిలీజ్ చేసింది. వాట్సప్ అకౌంట్‌ను ఇతరులు చూడకుండా లేదా వాడకుండా ఉండేందుకు ఈ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఫీచర్ పనిచేస్తుంది.
యూజర్ల అకౌంట్ భద్రత దృష్ట్యా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫీచర్‌లో ఫేస్ రిగక్నైజేషన్ ఆప్సన్ లేదు. స్టేబుల్ వాట్సప్ యూజర్లకు ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఐఫోన్ యూజర్లకు ఇప్పటికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ యూజర్లకు ఫింగర్ ఫ్రింట్ అథంటికేషన్ ఫీచర్ మాత్రమే కాకుండా టచ్ ఐడీ, ఫేషియల్ రిగక్నైజేషన్ ఫీచర్ల ద్వారా కూడా వాట్సప్ అన్ లాక్ అవుతుంది.
ఈ ఫీచర్ యాక్టివేట్ చేయాలనుకునే ఆండ్రాయిడ్ బీటా యూజర్లు ముందుగా తమ వాట్సప్ అకౌంట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్ దగ్గర కనిపించే అకౌంట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే యూస్ ఫింగర్ ఫ్రింట్ టు అన్‌లాక్ అప్షన్‌పై ప్రెస్ చేయాలి