• తాజా వార్తలు

వాట్సప్‌లో సరికొత్త థీమ్ ఛేంజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది ?

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో, కొత్త హంగులతో యూజర్లకు కొత్త అనుభూతిని అందిస్తున్న వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ తో వినియోగదారులను అలరించనుంది. రోజురోజుకూ కొత్త అప్‌డేట్స్‌తో వినియోగదారులను మరింత మెప్పించేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్‌లో ఇప్పటివరకు వాల్‌పేపర్ మాత్రమే మార్చుకునే సదుపాయం ఉంది. దానికి బదులు ఇప్పుడు థీమ్ మార్చుకోవచ్చు. ఇక ఈ థీమ్ గురించి పరిచయమే అవసరం లేదు. వాల్ పేపర్ తో పాటు దాని పైనున్న ఐకాన్లు అన్ని మారిపోతాయి.

వాల్ పేపర్ మాత్రమే మార్చుకుంటే చాటింగ్ వెనుక స్క్రీన్ మాత్రమే ఫొటో అయినా డార్క్ కలర్ బ్యాక్ గ్రౌండ్ అయినా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు థీమ్ ఛేంజ్ వస్తే థీమ్‌ను బట్టి ఐకాన్‌లలోనూ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. దీంతో పాటు వాట్సప్ స్టిక్కర్లను యాప్‌లోనే ఉండేలా ఎమోజీలలాగే వాడుకునే సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు. 

ఇప్పటికే టెస్ట్ వెర్షన్ లా గ్రీన్ కలర్ థీమ్ ను విడుదల చేసిన వాట్సప్ స్పందనను బట్టి ఆండ్రాయిడ్ వర్షన్లలోనూ దీనిని అందించేందుకు కృషి చేస్తుంది. సోషల్ మీడియాకు అనుగుణంగా అప్‌డేట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా థీమ్స్ మార్చుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు బ్లాగులో తెలిపింది. 

జన రంజకమైన వార్తలు