• తాజా వార్తలు

జియోమీ క్వై సికిల్ ఎలక్ట్రిక్ ఫోల్దింగ్ బైక్ --- ఇక బైక్ ని మడత పెట్టేయ్య వచ్చు

చైనీస్ టెక్ దిగ్గజం జియోమీ –కొత్తగా మీ స్మార్ట్ బైక్ ను విడుదల చేయనున్నట్లు నిన్న మనం చదువుకున్నాం కదా! నిన్న అంటే జూన్ 23 వ తేదీన జియోమీ సంస్థ తన మీ స్మార్ట్ బైక్ ను విడుదల చేసింది. విడుదల చేయడo తో పాటు ఒక ప్రకటన కూడా చేసింది. “జియోమీ కేవలం స్మార్ట్ ఫోన్ కంపెనీ మాత్రమే కాదు, ఇది ఒక టెక్నాలజీ కంపెనీ” ఎందుకంటే కేవలం స్మార్ట్ ఫోన్ లను మాత్రమే కాక జియోమీ అనేక రకాల సాంకేతిక పరికరాలను కూడా తయారు చేస్తుంది.అవేంటో చూద్దాం.

“ స్మార్ట్ ఫోన్ లూ, టాబ్లెట్ లూ, వేరబుల్స్, ఇంటర్ నెట్ కనెక్టెడ్ ఎయిర్ మరియు వాటర్ ప్యూరిఫయర్స్, టీవీ మోడల్స్ (మీ టీవీ సిరీస్ ), బెడ్ సైడ్ లాంప్ లూ, మీ రైన్ బో 5 AA బాటరీలు ,సెల్ఫ్ బాలన్సింగ్ స్కూటర్ లూ మొదలైనవి.” జియోమీ యొక్క ఉత్పాదనలు

ఇక ఈ మీ స్మార్ట్ బైక్ విషయానికొస్తే దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో  చూద్దాం

  1. ఇది ఎలక్ట్రిక్ ఫోల్దింగ్ బైక్
  2. దీని ధర సుమారు 30,000 వరకూ ఉంటుంది.
  3. కార్బన్ ఫైబరు లూ మరియు సెన్సార్ లతో తయారు చేయబడిన ఈ సైకిల్ బరువు సుమారు 7 కిలోలు మాత్రమే
  4. ఈ సైకిల్ కి రెడ్ డాట్ డిజైన్ అవార్డు లభించింది.
  5. ఇది ఫోల్డబుల్ బైక్ కాబట్టి దీనిని ఎలాగైనా మడత పెట్ట వచ్చు దీనికున్న ఈ సౌలభ్యం వలన ఇది కార్ లో కూడా ఇట్టే పడుతుంది.
  6. దీనికి ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది.
  7.  దీని మోటార్ సామర్థ్యం 250 W  36 V ఉంటుంది. దీని టార్క్ సామర్థ్యం రైడర్ యొక్క పెడల్ పవర్ కు సరిపోయే విధంగా ఉంటుంది.
  8. ఇది పానాసోనిక్ 18650 mAh బాటరీ ని కలిగి ఉంటుంది. ఇది సుమారు 45 కిలోమీటర్ ల వరకూ ఉండగల్గుతుంది.
  9. ఒకవేళ బాటరీ అయిపోయినా సరే బైక్ నడిచే విధంగా ఈ బైక్ లో షిమానో గేర్ షిఫ్టర్ లు ఉన్నాయి.
  10.  అంతేగాక  ప్రయాణ దూరం తో పాటు ప్రయాణ వేగం, ప్రయాణ వేగం, ఖర్చు అయిన కాలరీ ల వివరాలు తదితర వివరాలన్నీ దీనిపై కనిపిస్తాయి.

ఇంకా ఈ మీ స్మార్ట్ బైక్ కు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అవి సమగ్రం తెల్సుకోవాలంటే అది ఇండియా వచ్చే వరకు ఆగాల్సిందే.

 

జన రంజకమైన వార్తలు