స్మార్ట్‌ఫోన్ల అమ్మకం పెరుగుతున్న కొద్దీ వాటి యాక్సెసరీల అమ్మకం కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. ఒకప్పుడు సెల్ ఫోన్ కొంటే దాంతోపాటే ఇచ్చే వైర్డ్ ఇయర్‌ఫోన్సే ఇండియాలో వాడేవారు. బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వాడకం ఇప్పుడు భారీగా పెరిగింది. దానికితగ్గట్లే షియోమి నుంచి యాపిల్ వరకు అన్ని కంపెనీలూ ఫోన్లతోపాటే ఇయర్‌బడ్స్, ట్రూవైర్‌లెస్ ఇయర్‌ఫోన్లను లాంచ్ చేస్తూ భారీగా అమ్మకాలు సాగిస్తున్నాయి.
40 లక్షల ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్ల అమ్మకం
ఈ ఏడాది ఇప్పటి వరకు 40 లక్షల ట్రూవైర్‌లెస్ ఇయర్ ఫోన్లు ఇండియాకు షిప్ అయ్యాయి. ఇది ఇండియాలో ఆల్‌టైమ్ హై రికార్డ్. ఈ వేరబుల్స్ మార్కెట్ గత ఏడాదితో పోల్చితే ఏకంగా 165 % పెరిగిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) లెక్కగట్టింది. ఇందులో ఇయర్ ఫోన్లతోపాటు స్మార్ట్‌వాచ్‌లు, బాండ్లు కూడా ఉన్నాయి.
బోట్ టాప్
వేరబుల్స్ మార్కెట్‌లో బోట్ టాప్‌లో ఉంది. దీంతోపాటు షియోమి,రియల్‌మీ పోటీపడుతున్నాయి. శాంసంగ్, ఒప్పో, యాపిల్ కూడా పోటీలో ఉన్నాయి.