• తాజా వార్తలు

DSLR కెమెరా లు అంటే ఏమిటి? ఇండియా లో దొరుకుతున్న టాప్ DSLR కెమెరా లు ఏవి?

DSLR కెమెరా లు అంటే ఏమిటి? మామూలు కెమెరా లకు మరియు DSLR కెమెరా లకు మధ్య వ్యత్యాసాలేవి? ఈ DSLR కెమెరా లను ఉపయోగించడం వలన ఫోటో యొక్క నాణ్యత లో ఏవైనా మార్పులు ఉంటాయా? వీటివలన ఉండే అదనపు ప్రయోజనాలు ఏవి? ఇండియా లో లభిస్తున్న అత్యుత్తమ DSLR కెమెరా లు ఏవి? తదితర విషయాలను ఈ ఆర్టికల్ లో చదువుకుందాం.
అసలు DSLR కెమెరా లు అంటే ఏమిటి?
DSLR అనేది కెమెరా లలో ఒక సరికొత్త టెక్నాలజీ మరియు ట్రెండ్.మనలో చాలామంది వీటి గురించి వినే ఉంటాము కానీ అసలు ఇవి అంటే ఏమిటి అనే విషయం ఎవరికీ తెలియదు. DSLR అంటే డిజిటల్ సింగల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా. ఆప్టిక్స్ ను మరియు సింగల్ రిఫ్లెక్స్ కెమెరా యొక్క మెకానిజం ను డిజిటల్ కెమెరా ద్వారా కలిపిఉంచే టూల్ ఇది. తద్వారా అద్భుతమైన క్వాలిటీ తో కూదినఫోతో లను పొందవచ్చు.
ఇది మామూలు డిజిటల్ కెమెరాలకు ఏ విధంగాభిన్నంగా ఉంటుంది?
DSLR కెమెరా లు పనితీరు లోనూ మరియు ఫోటో గ్రాఫి లోనూ మామూలు డిజిటల్ కెమెరాల్ కు కొంచెం భిన్నంగా ఉంటాయి. అలాంటి కొన్ని వ్యత్యాసాలు ఇక్కడ చూద్దాం.
ధర : DSLR కెమెరా ల ధర మామూలు డిజిటల్ కెమెరా ల ధర తో పోలిస్తే రెండు , మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
వ్యూ ఫైండర్ : ఫోటో లు తీసేటపుడు మామూలు కెమెరా ల వ్యూ తో పోలిస్తే ఇందులో అద్భుతమైన వ్యూ ఉంటుంది
ఫోటో క్వాలిటీ: DSLR కెమెరా లు అద్భుతమైన క్వాలిటీ తో కూడిన ఫోటో లను అందిస్తాయి. దూరంగున్న వస్తువులను కాప్చర్ చేసినా సరే ఏ విధమైన మసక అనేది లేకుండా నాణ్యమైన ఫోటో లను ఇవి అందిస్తాయి.
DSLR కెమెరా ల ఉపయోగాలు ఏవి?
1. అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీ
2. సందర్భాన్ని మరియు యూజర్ ను బట్టిమార్చుకోవడానికి వీలుగా ఉండే ఫ్లెక్సిబుల్ కంట్రోల్ లు
3. అవసరానికి తగ్గట్లు వాడుకునే వివిధ రకాల లెన్స్
4. కాంతికి ఎక్కువగా ప్రతిస్పదించే లక్షణం
ఇపుడు మన దేశం లో దొరికే టాప్ DSLR కెమెరా లను వాటి రిసోల్యూషన్ తో సహా చూద్దాం
1. కానన్ EOS 1200D 18 MP
2. నికన్ D3300 24.2 MP
3. నికన్ D3200 24.2 MP
4. నికన్ D 5200 24.1 MP
5. కానన్ EOS 100D 18 MP
6. పెంతాక్స్ K- 500 16 MP
7. నికన్ D 3100 14.2 MP
8. కానన్ EOS 700 D 18 MP
9. సోనీ ఆల్ఫా A58Y 20.1 MP
10. నికన్ D 5300 24.2 MP
11. పానసనిక్ లుమిక్స్ DMC FZ 300 12.1 MP
12. సోనీ ఆల్ఫా A58K 20.1 MP

జన రంజకమైన వార్తలు