• తాజా వార్తలు

మీ స్మార్ట్‌ఫోనే మీ హోటల్‌ గదికి తాళం చెవి..!

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చిన తరువాత ప్రతి విషయం మన అరచేతిలో ఇమిడిపోతోంది. మన దగ్గర ఏమి లేకున్నా కేవలం స్మార్ట్‌ఫోన్‌ ఉంటేచాలు అన్నిపనులు చకచకా జరిగిపోతాయి. ఇప్పటివరకూ స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లైన్‌ సేవలు, ఫోన్‌ మాట్లాడటానికి, సామాజిక మాధ్యమాలు, ఇతర విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. కానీ రానున్న రోజుల్లో మన భద్రత విషయంలో కూడా మనకు సహాయం చేయనుంది. ఏవైనా పనుల నిమిత్తం మనం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సహజంగానే హోటల్‌, లార్జ్‌లో దిగి మన పనులు చక్కబెట్టుకుని వచ్చేస్తాం. ఇలాంటి సమయాల్లో మనం నేరుగా లార్జీ దగ్గరకు వెళ్లి అక్కడ కాళీలు ఉన్నాయా లేవా అని చూసి గదిని అద్దెకు తీసుకుంటాం. కొన్ని మెట్రోపాలిటన్‌ సిటీలలో అన్‌లైన్‌లో రూములు బుక్‌చేసుకునే సౌకర్యం ఉంది. డబ్బులు కూడా అన్‌లైన్‌లో చెల్లింపులు చేయవచ్చు. ఇన్ని చేసుకున్నా కూడా హోటల్‌ రిసెప్శన్‌ దగ్గర మన వివరాలు చెప్పి ఆ గదికి సంబందించిన తాళం తీసుకుని వెళ్లాలి. మనం తీసుకునే ఇతర వాటికి అదనపు చెల్లింపులు అక్కడే చెల్లించాల్సి ఉంటుంది. కానీ త్వరలో మీరు రిసెప్శన్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ స్మార్ట్‌ఫోన్‌ సహాయంతో రూమును తెరవవచ్చు, మూసివేయవచ్చు. నిజం అన్‌లైన్‌లో హోటల్‌ బుక్‌చేసుకునే ముందే మన క్రెడిట్‌కార్డ్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వగానే అక్కడ అటోమేటిక్‌గా సేవ్‌ అవుతాయి. డబ్బు ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా మనం గదిని కాళీ చేసిన తరువాత అటోమేటిక్‌గా దానికి తగిన చెల్లింపులు జరిగిపోతాయి. అంతేకాదు మనం రూము బుక్‌ చేయగానే మన స్మార్ట్‌ఫోన్‌కు ఒక కీ వస్తుంది. ఇది ఫోన్‌కు ఉండే బ్లూటూత్‌ సహాయంతో పనిచేస్తుంది. ఒకసారి మన ఫోన్‌కి కీ వచ్చిన తరువాత నేరుగా హోటల్‌ గదికి వెళ్లి బ్లూటూత్‌ అన్‌ చేయగానే ఆటోమేటిక్‌గా గదితాళం తెరుచుకుంటుంది. తిరిగి మనం బయటికి వెళ్లేముందు కూడా బ్లూటూత్‌ సహాయంతో క్లోజ్‌ చేయవచ్చు. ప్రస్తుతం ఫారిన్‌లో ఈ సదుపాయం అమలులో ఉంది. అది కూడా హిల్లాన్‌ అనే హోటల్‌ ఇలాంటి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియాలో కూడా వీరి బ్రాంచులు ఉన్నాయి. వాటిలో 15 రూములకు ఈ సదుపాయం ఉంది. అతి త్వరలో మిగతా వాటిలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ హోటల్‌ నిర్వాహకులు తెలిపారు. ఇది సక్సెస్‌ అయితే ఇండియాలో చాలా వరకు ఇలాంటి సదుపాయం అమలులోకి తెచ్చే అవకాశం ఉంది.

జన రంజకమైన వార్తలు