ఆస్తమా ఒక్కసారి వస్తే జీవితాంతం తీసుకుంటూ ఉండాల్సిన జబ్బు. బయట కాలుష్యమే కాదు ఇంట్లో ఏసీ రూమ్‌ల్లో కూర్చున్నా స్వచ్ఛమైన గాలి అందక ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. అందుకే ఇప్పుడు ఏసీ కంపెనీలు ఎయిర్ ఫ్యూరిఫయర్లతో కూడిన ఏసీలు తయారుచేస్తున్నాయి. అంటే వీటిలో ఎయిర్ అయోనైజర్స్ ఉంటాయి. ఇవి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి.అంతేకాదు ఎయిర్ ప్యూరిఫయర్, ఏసీ రెండూ కొనక్కర్లేకుండా ఒక్కదానితోనే రెండు పనులూ పూర్తవుతాయి. ఎయిర్ అయోనైజర్స్‌తో వచ్చిన బెస్ట్ ఏసీల గురించి మీకోసం..
హేయర్ హెచ్ఎస్‌యూ-19TCR3C 1.5 టన్ స్ప్లిట్ ఏసీ వైట్ (Haier HSU-19TCR3C 1.5 Ton Split Ac White)
ఇది 20000 ions/ccని ప్రొడ్యూస్‌చేసే అయొనైజర్లను కలిగి ఉన్న ఏసీ. ఇది చాలా నెగిటివ్ అయాన్స్‌ను రిలీజ్ చేస్తుంది. ఇవి అలర్జీ కలిగించే కారకాలతో పోరాడతాయి. ఈ ఏసీ దుమ్ము, ఎలర్జీ కలిగించే సూక్ష్మజీవులను తొలగించి మీకు ఇండోర్‌లో కూడా స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. అంతేకాదు 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా మంచి చల్లదనాన్నిచ్చే ఈ హేయర్ హెచ్ఎస్‌యూ-19TCR3C 1.5 టన్ స్ప్లిట్ ఏసీ వైట్ మీ ఎలక్ట్రిసిటీ బిల్లలుఓ 63 శాతం ఆదా కూడా చేస్తుందని కంపెనీ చెబుతోంది.
ధర 30,500
క్యారియర్ 18కే సుపీరియా ప్లస్ కే ప్లస్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (Carrier 18K Superia Plus K+ Inverter Split AC)
క్యారియర్ 18కే సుపీరియా ప్లస్ కే ప్లస్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలో అడ్వాన్స్‌డ్ ఈ4 అయొనైజర్ ఉంది. ఇది సూక్ష్మజీవులను తొలగించడమే కాకుండా దుర్వాసనను కూడా పోగొడుతుంది. అంతేకాదు దీనిలో ఉన్నబిల్ట్ ఇన్ సెన్సార్లు రూమ్ టెంపరేచర్‌ను ఎప్పటికప్పుడు గుర్తించి ఆటోమేటిగ్గా ఏసీలో టెంపరేచర్ అడ్జెస్ట్ చేస్తాయి.
ధర 43,800
ఎల్జీ 1.5 టన్, 3 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (LG 1.5 Ton, 3 Star Dual Inverter Split AC)
ఎయిర్ ఫ్యూరిఫికేషన్ ఫీచర్లతో ఉన్న మరో ఏసీ.. ఎల్జీ 1.5 టన్, 3 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ. దీనిలో కాపర్ విత్ ఓషియన్ బ్లాక్ ప్రొటెక్షన్ ఉంది. ఇది దుమ్ము, పొగ, కాలుష్యకారకాలను బయటకు పంపి స్వచ్ఛమైన గాలిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీనిలో ఉండే 3M మైక్రో డస్ట్ ప్రొటెక్షన్ ఫిల్టర్ 0.3 మి.మీ.కంటే చిన్న దుమ్ము కణాలను కూడా పారదోలుతుంది. అంతేకాదు దోమలను తరిమికొట్టే ప్రొటెక్షన్ ఎగయినెస్ట్ మస్కిటోస్ ఫీచర్ కూడా ఉంది.
ధర 44,990
ఎల్జీ జేఎక్స్-క్యూ12బీటీఎక్స్‌డీ 1టన్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ (LG JX-Q12BTXD 1 Ton Inverter Split AC)
ఎల్జీ నుంచి వచ్చిన మరో ఎయిర్ ఫ్యూరిఫయర్ ఏసీ ఇది. ఈ ఎల్జీ జేఎక్స్-క్యూ12బీటీఎక్స్‌డీ 1టన్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీలో డబుల్ ఫిల్టరేషన్ సిస్టం ఉంటుంది. ఇది ఎలర్జీని కలిగించే సూక్ష్మక్రిములను, దుమ్ము ధూళి వంటి వాటిని తొలగించి మంచి గాలినిస్తుంది. ఈ ఏసీలో డీహ్యుమిడిఫికేషన్, యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందలో ఉండే ఆటోక్లీన్ ఫీచర్ ఎప్పటికప్పుడు మీ ఏసీని దానికదే క్లీన్ చేసేస్తుంది. టెంపరేచర్‌ను తగ్గిస్తూ, పెంచుతూ బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తుంది.
ధర 31,999.