స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ అంటే ప్రత్యేకంగా ఏదైనా సందర్భాన్ని పురస్కరించుకుని ఫోన్ రిలీజ్ చేయడం. ఉదాహరణకు వివో ఐపీఎల్ ఎడిషన్ ఫోన్లలాంటివి. కొన్నిసార్లు స్పెషల్ ఫీచర్లతో కూడా ఇలాంటి ఫోన్లు రిలీజ్ చేస్తారు. మిగతా ఫోన్లకంటే ఫీచర్స్‌లో, లుక్‌లోనే కాదు ధరలో కూడా హైలెవెల్లో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే యూజర్స్‌లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ల టార్గెట్. యాపిల్, వన్‌ప్లస్, షియోమిలాంటి కంపెనీల నుంచి ఇలా రిలీజయిన స్పెషల్ ఎడిషన్ ఫోన్ల గురించి చూసేద్దాం రండి..
ఐఫోన్ 8, 8 ప్లస్ రెడ్ (iPhone 8, 8 Plus Red)
యాపిల్ తన ఐఫోన్ 8, 8 ప్లస్‌లకు రెడ్ పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ రిలీజ్ చేసింది. హెచ్‌వీ / ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రెడ్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో యాపిల్ ఈ రెడ్ ఎడిషన్లు రిలీజ్ చేసింది. ఐఫోన్ 8 రెడ్ ధర కూడా మామూలు ఐఫోన్ 8 అంతే ఉంది. 64 జీబీ వేరియంట్ ధర 67,940 రూపాయలు కాగా 256 జీబీ వేరియంట్ ధఱ 81,500. ఐఫోన్ 8 ప్లస్ రెడ్ ఎడిషన్ 64 జీబీ ధర 77,560. 256 జీబీ ధర 91,110. ఐఫోన్ 7 కంటే అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో, మరింత పవర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్‌తో ఈ ఫోన్‌ను యాపిల్ రిలీజ్ చేసింది.
షియోమి ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ (Xiaomi Mi 8 Explorer Edition)
షియోమి కంపెనీ చైనాలో జరిగే తన వార్షికోత్సవంలో ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ను రిలీజ్ చేసింది. ట్రాన్స్‌పరెంట్ బ్యాక్ ప్యానల్, 3డీ ఫేస్ అన్‌లాక్ ఫీచర్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ దీని ప్రత్యేకతలు. 845 ఎస్‌వోసీ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్‌తో సూపర్ ఫాస్ట్ పవర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఆడ్రినో 630 జీపీయూ ఉంది. 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో 12 మెగాపిక్సెల్స్‌తో బ్యాక్‌సైడ్ రెండు కెమెరాలు, ఫ్రంట్ 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓరియోమీద నడిచే ఎంఐయూఐ ఓఎస్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఇతర స్పెక్స్. ధర 38 వేల వరకు ఉంది.
వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎడిషన్ (OnePlus 6 Marvel Avengers Infinity War Edition)
వీడియోగేమ్ లవర్స్‌కి బాగా పరిచయమున్న పేరు అవెంజర్స్. ఇదే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ బ్రాండింగ్‌తో వన్ ప్లస్ 6 స్పెషల్ ఎడిషన్ రిలీజింది. ఇందులో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజి తప్ప మిగిలిన ఫీచర్లన్నీ రెగ్యులర్ వన్‌ప్లస్ 6 మాదిరిగానే ఉంటాయి. 6.28 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ స్క్రీన్, 16 ఎంపీ, 20 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాస్, ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోసీ ప్రాసెసర్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర 44,999.
ఓపో ఫైండ్ ఎక్స్ లాంబార్గినీ (Oppo Find X Lamborghini)
కార్ల గురించి ఫాలో అయ్యేవారికి లగ్జరీ కారు లాంబార్గినీ గురించి ప్రత్యేకగా చెప్పక్కర్లేదు. ఆ లాంబార్గినీ బ్రాండ్‌తో ఓపో పైండ్ ఎక్స్ మోడల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఉంటాయి. ఎస్డీ కార్డుతో 400 జీబీ వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు. 6.4 ఇంచెస్అమోల్డ్ స్క్రీన్, 16 ఎంపీ, 20 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాస్, ముందు భాగంలో 25 ఎంపీ 3డీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోసీ ప్రాసెసర్, 3,730 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. బ్యాక్ కవర్‌పై త్రీడీలో లాంబార్గినీ లోగో కనిపిస్తుంది. ఈ ఫోన్ ధర లక్షా నలభై వేల రూపాయల వరకు ఉండొచ్చు.
వివో నెక్స్ ఎస్ (Vivo NEX S)
వివో నెక్స్ స్పెషల్ ఎడిషన్ వివో నెక్స్ ఎస్‌లో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఉంటాయి. 6.59 ఇంచెస్ సూపర్ అమోల్డ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోసీప్రాసెసర్, 3,730 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. గ్రాఫిక్స్ కోసం ఆడ్రినో 630 జీపీయూ ఉంది. అయితే కెమెరాపరంగా వీకే. 12 ఎంపీ, 5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాస్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ ధర లక్షా నలభై వేల రూపాయల వరకు ఉండొచ్చు.