• తాజా వార్తలు

ఇప్పుడు క్రోమ్ బ్రౌజ్ చేయడానికి నెట్ అవసరం లేదు

మన స్మార్ట్ ఫోన్ లలో ఇంటర్ నెట్ ను వాడేటపుడు కనెక్షన్ వీక్ గా ఉండడం వలన వెబ్ పేజి లు తొందరగా లోడ్ అవ్వక మనలను చికాకు పెడుతూ ఉంటాయి. ఇది మనలో దాదాపు అందరికీ అనుభవమే. అయితే ఇకపై ఇలాంటి చికాకులు ఉండవు. సెర్చ్ దిగ్గజం అయిన గూగుల్ తన యొక్క క్రోమ్ బ్రౌజర్ కు ఒక సరికొత్త అప్ డేట్ ను విడుదల చేసింది. ప్లే స్టోర్ లో ఈ సరికొత్త అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసుకుని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు ఆఫ్ లైన్ లో కూడా వెబ్ పేజి లను యాక్సెస్ చేయవచ్చు. ఇంతకుముందు ఆండ్రాయిడ్ లోని క్రోమ్ బ్రౌజర్ లో మీరు కేవలం వెబ్ లింక్ లను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునేవారు. వెబ్ పేజి లు డౌన్ లోడ్ చేయడం వీలు పడేది కాదు . అలాంటి ఫీచర్ పాకెట్ మరియు ఇన్ స్టా పేపర్ లాంటి కొన్ని యాప్ ల ద్వారా గత కొన్ని సంవత్సరాలనుండీ అందుబాటులో ఉన్నప్పటికే ఆఫ్ లైన్ యాక్సెసబిలిటి అనేది ఒక పెద్ద స్టెప్ గా ఉండేది. అయితే ఈ సరికొత్త అప్ డేట్ విడుదల అయిన వారం రోజులలోనే ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో 45 మిలియన్ ల డౌన్ లోడ్ లను పొందిందంటే ఇది ఏ స్థాయి లో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ అప్ డేట్ ద్వారా వెబ్ పేజి లను డౌన్ లోడ్ చేసుకోవడం చాలా సులభం. అది ఎలాగో చూద్దాం.
1. గూగుల్ ప్లే నుండి అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
2. మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా ఒక వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
3. పేజి యొక్క పై భాగం లో ఉండే యుఆర్ఎల్ పై లాంగ్ ప్రెస్ చేయండి. డౌన్ లోడ్ ది పేజి లేటర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది.
4. ఈ పేజి ని డౌన్ లోడ్ చేసుకోండి. ఇది ఆఫ్ లైన్ రీడింగ్ కు కూడా అందుబాటులో ఉంటుంది.
5. డౌన్ లోడ్ అయిన తర్వాత మీరు సేవ్ చేసిన ఆర్టికల్ మీ రీసెంట్ డౌన్ లోడ్ లలో కనిపిస్తుంది. దానిని చూడాలి అంటే ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది.

జన రంజకమైన వార్తలు