భారతదేశం లో 4 జి ఇంటర్ నెట్ ఈ మధ్య కాలం లో అవధులను దాటి విస్తరిస్తుంది. దేశం లో మొబైల్ ఇంటర్ నెట్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడడం తో టెలికాం ఆపరేటర్ లు అందరూ వినియోగదారులకు గరిష్ట డేటా ప్రయోజనాన్ని కలిగించే దిశగా తమ ఆఫర్ లను ప్రకటిస్తున్నారు. ఈ ఆఫర్ లు అనేవి రిలయన్స్ జియో రాకతో మరొక స్థాయి కి వెళ్ళాయి. జియో వాటిని మరొక స్థాయికి తీసుకెళ్ళింది అని చెప్పవచ్చేమో. అవును ఈ నయా సంచలనం పోటీ ఆఫర్ లతో భారత టెలికాం రంగాన్ని ఒక ఊపు ఊపేసింది. జియో ప్రస్తుతం 20GB 4 జి డేటా ను రూ 1499/- లకే అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. అయితే ప్రస్తుతం వెల్ కం ఆఫర్ నడుస్తున్న తరుణం లో ఈ ప్లాన్ మార్చి నుండి అమలయ్యే అవకాశం ఉంది.
మరొక వైపు భారత టెలికాం దిగ్గజాలు అయిన ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా లు కూడా జియో కు దీటుగా 4 జి డేటా ను అందించడం లో తమ ప్లాన్ లను ప్రకటించాయి. ఇవి కూడా జియో ప్రకటించిన ధర కే కొంచెం అటూఇటూగా తమ ప్లాన్ లను ప్రకటించాయి.
ఎయిర్ టెల్ 12.5 GB 4 జి డేటా కు రూ 1255/- లు ఛార్జ్ చేస్తుంది. ఇది ఒక్కో రాష్ట్రం లో ఒక్కో రకంగా ఉంటుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఇడియా లో రెండవ అతిపెద్ద మొబైల్ నెట్ వర్క్ అయిన వోడాఫోన్ కూడా ధర విషయం లో ఏ మాత్రం రాజీ పడకుండా 10 GB 4 జి డేటా ను రూ 1505/- లకు అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది.వీటిని నిశితంగా పరిశీలిస్తున్న ఐడియా సెల్యూలర్ కూడా 10 GB 4 జి డేటా ను రూ 1349/- లకే అందిస్తుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.
పైన చెప్పుకున్నట్లు ఎయిర్ టెల్ మరియు ఐడియా లు 28 రోజుల వ్యాలిడిటీ తో లభిస్తే వోడాఫోన్ మాత్రం 30 రోజుల వ్యాలిడిటీ లో లభిస్తుంది. అంటే సంవత్సరానికి వోడాఫోన్ అయితే 12 సార్లు రీఛార్జి చేయాల్సి ఉంటుంది, అదే ఎయిర్ టెల్ మరియు ఐడియా లైతే 13 సార్లు చేయాలి.
10 GB డేటా కు ఇంత ఖర్చు చేయడం అవసరమా?
ఇది ఒక్కోసారి అవసరం మరో సారి అనవసరం అనిపిస్తుంది. మీరు ఒకేదగ్గర ఉండేవారైతే జియో ని తీసుకోవడమే ఉత్తమం. అలాకాకుండా వివిధ ప్రదేశాలు తిరిగే వారైతే మాత్రం ఎయిర్ టెల్ ను మించిన ఆఫర్ లేదు. ఎందుకంటే ఇండియా లో అతిపెద్ద మొబైల్ నెట్ వర్క్ గా ఉన్న ఎయిర్ టెల్ దేశం లో ఏ మూలకు వెళ్ళినా సరే ఏ రకమైన సిగ్నల్ సమస్యలు ఉండవు. దీనికి చక్కని 4 జి నెట్ వర్క్ ఉంది. అదే జియో విషయానికొస్తే ఇది ఇంకా టెస్టింగ్ దశ లోనే ఉంది. మరియు సరైన టారిఫ్ ప్లాన్ లను ఇంకా ప్రకటించలేదు. దీని ఉచిత ఆఫర్ మార్చి వరకూ కొనసాగుతుంది. కాబట్టి మార్చి తర్వాతే దీనిని లెక్కలోనికి తీసుకోవాలి.