• తాజా వార్తలు

21 భాషల ఫోన్ పానసోనిక్ పీ66

లక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు పానాసోనిక్ మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఇటీవలకాలంలో స్పీడు పెంచింది. ఇప్పటికే పానసోనిక్ ఫోన్లకు మార్కెట్లో వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్సు ఉంది. ఫీచర్లలో నాణ్యత... ఇతర అన్ని ఫోన్లలో కనిపించే ఫోన్ వేడెక్కడం, హ్యాంగవడం వంటి సమస్యల్లేని ఫోన్లుగా పానసానిక్ పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో పానసోనిక్ పీ55 సిరీస్, ఎలూగా సిరీస్ లకు మంచి ఆదరణ ఉంది. అయితే.. ఆన్ లైన్లోనే ఎక్కువగా దొరుకుతుండడం.. అది కూడా కొన్ని సైట్లలోనే ఉండడం... ఆఫ్ లైన్ లో అందుబాటులో దొరక్కపోవడం... సాంకేతిక సమస్యలు రాకపోయినప్పటికీ సర్వీసు సెంటర్లు అందుబాటులో లేకపోవడం కూడా ఈ సంస్థ ఫోన్ల విక్రయాలకు అడ్డంకిగా మారుతోంది.

ఇవన్నీ ఎలా ఉన్నా పానసోనిక్ నుంచి తాజాగా వచ్చిన మరో స్మార్ట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

'పి66 మెగా' పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది పానసోనిక్. దీని ధర రూ.7,990.. ఫీచర్లు మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇది 21 భాషలను సపోర్ట్ చేస్తుండడం ఆసక్తికరంగా ఉంది.

మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ షాపింగ్, సోషల్ నెట్ వర్కింగ్ , వర్చువల్ ఎంటర్ టైన్ మెంట్ కు వీలుగా భారతీయ భాషల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

స్పెసిఫికేషన్లు

- 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

- గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

- 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్

- ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్

- 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

- 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ

 

జన రంజకమైన వార్తలు