ఫోన్ బాగా కనిపిస్తే... చాలు కంపెనీ ఏదన్నది చూడడంలేదు. అందులోనూ ఆన్ లైన్ సేల్స్ లో ప్రీ ఆర్డర్లు తీసుకుని హైప్ క్రియేట్ చేస్తే జనం వేలంవెర్రిగా కొంటున్నారు. అందుకు... లీ ఎకో ఫోన్లే ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే ఓ విడత భారీగా విక్రయాలు చేపట్టిన లీ ఎకో ఫోన్ రెండో విడతలో అంతకుమించి విక్రయాలు నమోదు చేసింది. ఫ్లాష్ సేల్ అంటే చాలు ఆర్డర్లు, రిజిస్ట్రేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి.దీంతో భారత దేశంలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ కు ఎంత డిమాండ్ ఉందో తేటతెల్లం అవుతోంది. తాజాగా ఫ్లిప్ కార్ట లో లీ ఎకో అనే సరికొత్త స్మార్ట్ ఫోన్ సంస్ధ ఫ్లాష్ సేల్ కోసం ఆర్డర్లు రిజిస్ట్రేషన్లు కోరింది. ఆఫర్ ప్రారంభమవ్వగానే ఆర్డర్లు వెల్లువ మొదలైంది. కేవలం 31 సెకెన్లు ముగిసేసరికి ఈ ఫోన్ కావాలంటూ రెండు లక్షల ఇరవై వేల మంది ఆర్డర్ చేసుకోగా సుమారు 20,28,000 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారని ఫ్లిప్ కార్డ్ వెల్లడించింది. ఇంతకుముందు ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో నిర్వహించిన తొలి ఫ్లాష్ సేల్‌లో 3 సరికొత్త రికార్డులను సృష్టించింది లీ ఎకో. మొత్తం 6.05 లక్షల మంది ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకోగా, కేవలం 2 సెకండ్లలోనే 70వేల 'ఎల్‌ఈ 1ఎస్' స్మార్ట్‌ఫోన్లను ఫ్లాష్‌సేల్‌లో అమ్మేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్‌లలో ఇదే అత్యధికంగా అమ్ముడవగా, తక్కువ వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడైన ఫోన్‌గా, అత్యధిక రిజిస్ట్రేషన్లు వచ్చిన డివైస్‌గా 'ఎల్‌ఈ 1ఎస్' రికార్డులను సృష్టించింది. |