• తాజా వార్తలు

అందుబాటు ధరలో ఉన్న 4 విండోస్ 10 లాప్ టాప్ లు

 

అందుబాటు ధరలో ఉన్న 4 విండోస్ 10 లాప్ టాప్ లు

లాప్ టాప్  మరియు టాబ్లెట్ రెండూ ఒకే పరికరం లో ఉంటే ఎలా ఉంటుంది? చాలా సౌకర్యం గా ఉంటుంది కదా! మనం లాప్ టాప్ లేదా టాబ్లెట్ లలో ఏది కావాలంటే దానిని ఈ పరికరం ఉపయోగించి వాడుకోవచ్చు. యువతకు ప్రత్యేకించి స్టూడెంట్స్ కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి బహుళార్ధ ప్రయోజనాలు ఉన్న పరికరం మన బడ్జెట్ లో లభిస్తే! వెంటనే తీసుకోవాలి అనిపిస్తుంది కదా. అలాంటి బడ్జెట్ లో దొరికే ట్యాబ్ కం లాప్ టాప్ లను మీ కోసం అందిస్తున్నాం.

Acer One 10 S1002- 112L

దీని ధర రూ 20,685/- లు ఉంటుంది. ఏసర్ వన్ 10 సిరీస్ అనేది వివిధ రకాల వేరియంట్ లలో లభిస్తుంది. ఇక్కడ మేము చెబుతున్నది ఈ సిరీస్ లో వచ్చే 112 L గురించి. ఇది 500 GB స్టోరేజ్ కెపాసిటీ ని కలిగి ఉంటుంది. ఈ పరికరాన్ని టచ్ స్క్రీన్ టాబ్లెట్ గానూ మరియు పూర్తి స్థాయి లాప్ టాప్ గానూ ఉపయోగించవచ్చు. ఇది 10.1 ఇంచ్ డిస్ ప్లే తో 1280x800 pixel  రిసోల్యుషన్ ను కలిగి ఉంటుంది. దీనిపై పనిచేయడం చాల సులువుగా ఉంటుంది. ఇది కీ బోర్డు తో కలిపి 1.3 Kg బరువు కీ బోర్డు లేకుండా 64 g బరువు ఉంటుంది. 1.3 GHz ఇంటెల్ ఆటం  క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు 2 GB RAM ను కలిగి ఉంటుంది. ఇది విండోస్ 10 పై పనిచేస్తుంది.

Dell Inspiron 11 3168 2-in-1

దీని ధర రూ 31,590/- లు ఉంటుంది. 11 అంగుళాలు ఉండే ఈ పరికరం లెనోవా యోగా రేంజ్ ను కలిగి ఉంటుంది. దీనిని వెనకకు తిప్పి టాబ్లెట్ లాగా వాడుకోవచ్చు. 1.39 Kg బరువు ఉంటుంది. మూవీ లు చూడడానికి దీనికి ఉన్న కీ బోర్డు ను కిక్ స్టాండ్ గా ఉపయోగించవచ్చు. ఇది నిండు బ్లూ మరియు ఎరుపు రంగులలో లభిస్తుంది. 2.56 GHz ఇంటెల్ పెంటియం N3710 ప్రాసెసర్ మరియు 4 GB RAM కలిగి ఉంటుంది. ఇది 500 G ఆన్ బోర్డు HDD స్టోరేజ్ ను అందిస్తుంది. ఇది విండోస్ 10 పనిచేస్తుంది.  మైక్రో సాఫ్ట్ ఆఫీస్ 2013 యొక్క ట్రయల్ వెర్షన్ ను కలిగి ఉండి MCafee సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ను  15 నెలల పాటు ఉచితంగా అందిస్తుంది.

Notion Ink Able

దీని ధర రూ 22,490/- లు ఉంటుంది. నోషన్ ఇన్క్ యొక్క కెయిన్ తర్వాతి మోడల్ అయిన ఈ ఏబెల్ బడ్జెట్ లో కన్వర్ట బుల్ పరికరం కావాలనుకునే వారికి ఒక మంచి ఎంపిక. మెటాలిక్ చసిస్ తో తయరు చేయబడిన కీ బోర్డు తో ఇది మంచి లుక్ ను కలిగి ఉంటుంది. విండోస్ 10 పై పనిచేస్తుంది. 10.6 ఇంచ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. 998 గ్రాముల బరువు ఉంటుంది. ఇన్ బిల్ట్ స్లిమ్ స్లాట్ ను కలిగి ఉంటుంది. 1.8 GHz ఇంటెల్ ఆటం Z 8300 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఇది 4 GB RAM తో లభిస్తుంది.

Lenovo Yoga 300

మార్కెట్ లో దొరికే బడ్జెట్ రేంజ్ కన్వర్ట బుల్ పరికరాలలో ఈ లెనోవా యోగా 360 ముందు వరుసలో ఉంటుంది. దీని ధర రూ 27,955 /- లు ఉంటుంది. 360 డిగ్రీల హింజ్ మెకానిజం ను కలిగి ఉంటుంది. దీనివలన మనం ఈ పరికరాన్ని ఎలాగైనా తిప్పవచ్చు. 1.3 Kg బరువును కలిగి ఉంటుంది. 11.6 ఇంచ్ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. 64 bit విండోస్ 10 పై ఇది పని చేస్తుంది. 500 GB HDD స్టోరేజ్ ను అందిస్తుంది. ఇంటెల్ పెంటియం N3540 ప్రాసెసర్ మరియు 4 GB RAM ను కలిగి ఉంటుంది.

 

" >

" >

జన రంజకమైన వార్తలు