• తాజా వార్తలు

4జీ ఫోన్ ఎట్ రూ.4 వేలు

రూ.4,000కే  4జీ ఫోన్ వస్తే.... ఆశ్చర్యమే కదా.  లేటెస్టు ఫీచర్లున్న స్మార్టు ఫోనే రూ.5 వేల లోపు దొరకడం లేదు. అలాంటిది ఏకంగా 4జీ ఫోన్ రూ.4 వేలకు అందుబాటులోకి రావడం గొప్ప విషయమే. రిలయన్స్ సంస్థ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఫోన్ ను తీసుకొస్తోంది.

అత్యధిక వేగంతో కూడిన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌తో పాట వేగవంతమైన మొబైల్ కాలింగ్‌ను వినియోగదారులకు చేరువ చేసే రిలయన్స్ జియో 4జీ మొబైల్ నెట్‌వర్క్ సేవలను ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించనున్నారు. విషయాన్ని స్వయంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీయే ప్రకటించారు. ఇంకో విషయం ఏమిటంటే.... డిసెంబరులో 4జీ సేవలు ప్రారంభించే సరికి 4జీ నెట్ వర్క్ ఫోన్లను కూడా అందుబాటులోకి తెచ్చేస్తామని ఆయన చెప్పారు.

రిలయన్స్ జియో 4జీ సర్వీసుల ద్వారా వేగవంతమైన మొబైల్ కాలింగ్, వేగవంతమైన డేటా బ్రౌజింగ్, డిజిటల్ కామర్స్ ఇంకా చెల్లింపు సేవలను పొందే వీలుంది. వీఓఎల్టీఈ (వాయిస్-ఓవర్-లాంగ్-టర్మ్-ఎవల్యూషన్) సాంకేతికతపై పనిచేసే 4జీ నెట్‌వర్క్ ఫోన్‌లను రూ.4,000 కంటే తక్కువ ధరకే ఇవ్వనున్నారట.  అంతేకాదు... అంతవరకు మనం వాడే పాత ఫోన్లలో ఉన్న డాటాను కొత్త ఫోన్లలోకి బదిలీ చేసుకోవడానికి వీలుగా జియోడ్రైవ్' అనే యాప్‌ను కూడా వీరు డెవలప్ చేస్తున్నారు.

 

జన రంజకమైన వార్తలు