ప్రస్తుతం నడిచేది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ట్రెండ్. గూగుల్‌లో గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి, మైక్రోసాఫ్ట్ కొర్టానా, అమెజాన్ అలెక్సా, శాంసంగ్ బిక్సీ, ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి పెద్ద కంపెనీ తమకు సొంతమైన ఆర్టిఫిషియల్ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాయి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజ్‌లలో ఏఐ టెక్నాలజీ సాధారణ విషయంగా మారింది. ప్రతి స్మార్ట్ డివైజ్‌కు ఈ టెక్నాలజీనే ఆధారంగా మారింది. అయితే వీటన్నిటిలో గూగుల్ అసిస్టెంట్ బాగా ప్రాచుర్యంలో ఉంది. కానీ గూగుల్ అసిస్టెంట్‌కు తోడు అందుబాటులో ఉన్న ఏఐ ప్రత్యామ్నాయాలేంటో చూద్దామా.
వర్చువల్ అసిస్టెంట్ డేటాబాట్
వర్చువల్ అసిస్టెంట్ డేటాబాట్ అనేది ఒక పర్సనల్ అసిస్టెంట్. మీరు ఎంచుకునే సబ్జెక్ట్‌ను బట్టి దీని పని తీరు ఉంటుంది. ఉదాహరణకు అలర్బ్ ఐన్‌స్టీన్‌ను ఎంచుకుంటే అతని గురించి ఎన్నో ప్రత్యేక ప్రశ్నలు సంధించి మీరు సమాధానాలు రాబట్టొచ్చు. ఈ ఫలితాలు టెక్ట్, వెబ్ రిజల్ట్స్, ఇమేజ్‌ల రూపంలో మీకు అందుబాటులోకి వస్తాయి. మీరు ఒరిజినల్ ఏఐ అసిస్టెంట్‌తో మాట్లాడుతున్నట్లుగానే ఫీల్‌ను కలిగిస్తుంది ఈ యాప్. దీన్ని మీరు పర్సనల్ సెక్రటరీగా కూడా ఉపయోగించుకోవచ్చు. అపాయింట్‌మెంట్స్, నోట్స్, సెట్ అలారమ్స్ లాంటి పనులు చేయించుకోవచ్చు.
లైరా వర్చువల్ అసిస్టెంట్
నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌ను ఆధారంగా చేసుకుని తయారు చేసిన యాప్‌లలో లైరా వర్చువల్ అసిస్టెంట్ కూడా ఒకటి. ఇది అన్నిటికంటే ఎక్కువ నమ్మదగినది.. తక్కువ తప్పులు చేసేదిగా పేరు పొందింది. దీనిలో సిరి కౌంటర్‌పార్ట్ కూడా ఉంది. మీకు ఐవోఎస్ డివైజ్ ఉంటే లైరా అసిస్టెంట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు. అలారం సెట్ చేసుకోవడం, వాయిస్ బేస్డ్ వెబ్ సెర్చ్‌లు, అపాయింట్‌మెంట్స్ లాంటివి చేసుకోవచ్చు.
రాబిన్-ఏఐ అసిస్టెంట్
హ్యాండ్స్ ఫ్రీ కంట్రోల్ కోసం ఈ రాబిన్ ఏఐ అసిస్టెంట్‌ను డెవలప్ చేశారు. మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినప్పుడు మీకు దారి చూపించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అంటే ట్రాఫిక్ లేని ఏరియాలను మీకు చూపించడం.. రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ అందించడం.. మీ వాయిస్ సాయంతో టెక్ట్‌లకు రిప్లే ఇవ్వడం లాంటి పనులు చేస్తుంది. అలారంతో పాటు ఇతర రిమైండర్లను కూడా చేస్తుంది ఈ టెక్నాలజీ.
మైక్రోసాఫ్ట్ కొర్టానా
మైక్రోసాఫ్ట్ కొర్టానాను విండోస్ డివైజ్‌లలో ఉపయోగించుకోవచ్చు. దీంతో మీకు డైలీ అప్‌డేట్స్, మీ షెడ్యూల్, ట్రెండింగ్ న్యూస్, వెదర్ అలర్ట్స్ లాంటి ఉపయోగాలున్నాయి దీంతో. మీ విండోస్ డివైజ్‌ను ఆండ్రాయిడ్‌తో కనెక్ట్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుందిది. మెసేజ్‌లను సెండ్ చేయడం.. రిసీవ్ చేయడం, నోటిఫికేషన్లను సింక్రనైజ్ చేయడం లాంటి పనులు కూడా చేసి పెడుతుంది.