ఆఫ్ లైన్ వర్డ్ ప్రోసెసింగ్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది MS ఆఫీస్ మరియు ఇందులో ఉండే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. వీటిని మనం చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ రెగ్యులర్ యూజర్లకు ఈ మైక్రో సాఫ్ట్ ఆఫీస్ సూట్ ను కొనడం అంటే కొంచెం ఖరీదైన డీల్. ఇలాంటి సమయంలోనే ఆఫీస్ టాస్క్ లను పూర్తి చేయడానికి మరియు ఆన్ లైన్ వర్డ్ ప్రోసెసింగ్ కు ఆన్ లైన్ సాధనం గా అందుబాటులోనికి వచ్చింది గూగుల్ డాక్స్. ఆఫీస్ టాస్క్లను పూర్తి చేయడానికి ఇంకా చాలా వెబ్ యాప్స్ ఉన్నాయి. చాలా మంది కొన్ని కారణాల వలన ఈ వెబ్ యాప్లను వాడుతున్నారు. మీరు ఎక్కడనుండి అయినా మీ డాక్యుమెంట్లను యాక్సెస్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు, చాలా సులభంగా ఇంపోర్ట్ మరియు ఎక్స్ పోర్ట్ చేయవచ్చు. ఈ యాప్స్ కు ఉన్న మరొక ప్రత్యేకత ఇవి ఉపయోగించడానికి చాలా సులువుగా ఉంటాయి. ఈ విధంగా గూగుల్ డాక్స్కు ప్రత్యామ్నాయంగా అనేక రకాల యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఈ వ్యాసం లో ఇస్తున్నాం. 1. జోహో - www.zoho.com/docs ఆన్ లైన్ బిజినెస్,ఉత్పాదకత మరియు భాగస్వామ్యం లాంటి వాటికి ఈ జోహో.కాం మంచి ఆఫీస్ సూట్ లను అందిస్తుంది. జోహో.కాం సుమారు 22 ఉచిత ఆన్ లైన్ అప్లికేషను లను అందిస్తుంది. CRM నుండీ మెయిల్ దాకా , ఆఫీస్ సూట్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, ఇన్ వాయిసింగ్, వెబ్ కాన్ఫెరెన్స్ ఇలా అనేక రకాల అప్లికేషను లను ఇది అందిస్తుంది. మీరు మీ జోహో ఎకౌంటు ను మీ గూగుల్ మరియు యాహూ ఎకౌంటులకు లింక్ చేసుకోవచ్చు. ఇది మీ డాక్యుమెంట్లను ఆటోమాటిక్ గా సేవ్ చేస్తుంది. దీనివలన నెట్ వర్క్ కనెక్షన్ అనుకోకుండా పోయినా సరే మీ డాక్యుమెంట్లు భద్రంగా ఉంటాయి. ఇది మీ ఇంటర్ నెట్ లేదా కంప్యూటర్ నుండి ఇమేజ్లని ఇన్సర్ట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. మీరు పని చేస్తున్న డాక్యుమెంట్ లక్ను మీరు ఎవరికైనా చూపించే అవకాశాన్ని కూడా ఇది కల్పిస్తుంది. 2. ఎతర్ పాడ్ - etherpad.org రియల్ టైం లో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించే మొట్టమొదటి వెబ్ బేస్డ్ వర్డ్ ప్రాసెసర్ ఈ ఎతర్ పాడ్. ఇక్కడ పాల్గొనే యూజర్లు అందరూ చేసే వర్క్ గానీ లేదా ఎడిటింగ్ కానీ అన్ని స్క్రీన్ లలోనూ కనిపిస్తుంది. తద్వారా టెక్స్ట్ డాక్యుమెంట్లద్వారా వచ్చే ఉత్పాదకత పెరుగుతుంది. మీటింగ్ నోట్ లకూ, డ్రాఫ్టింగ్ సెషన్ లకూ, ఎడ్యుకేషన్, టీం ప్రోగ్రామింగ్ లకూ ఈ ఎతర్ పాడ్ బాగా ఉపయోగపడుతుంది. 3. క్విప్ - quip.com ఒక టీంలో ఉపయోగించే లైవ్ డాక్యుమెంట్లను తాయారు చేయడంలో ఈ క్విప్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా వేగంగా ఉంటుంది, అంతేగాక మిగిలిన టాస్క్ లైన చాట్, టాస్క్ లిస్టు షేరింగ్, డాక్స్ మరియు స్ప్రెడ్ షీట్స్లను కూడా ఇది కలిగి ఉంటుంది. చెయిన్ ఈ mail లను ఓల్డ్ ఫాషన్ గా పరిగణిస్తున్న ఈ రోజుల్లో ఈ క్విప్ అనేది బాగా ఉపయోగకరంగా ఉంటుంది. 4. ఓన్లీ ఆఫీస్ - personal.onlyoffice.com ఇది MS ఆఫీస్ వర్డ్, పవర్ పాయింట్ మరియు స్ప్రెడ్ షీట్ లకు ఒక ఉచిత ప్రత్యామ్నాయం. ఈ ఆన్ లైన్ టూల్ మరింత ఉపయోగకరంగా ఉండాలంటే HTML5 మరియు కాన్వాస్ లాంటి అంశాలను కూడా ఉపయోగించవచ్చు. 5. హ్యాక్ పాడ్ - hackpad.com డ్రాప్ బాక్స్ కి సంబందించిన ఈ హ్యాక్ పాడ్ మంచి ఆకర్షణీయమైన ఇంటర్ పేస్ ను కలిగి ఉంది చక్కగా పనిచేస్తుంది. ఇందులో అనేక ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవి మీ డాక్యుమెంట్ లను ఆన్ లైన్ లో అందంగా తయారు చేస్తాయి. |