• తాజా వార్తలు

20వేల రూపాయ‌ల్లోపు ధ‌ర‌లో ఎంఐ స్మార్ట్ టీవీకి 5 ప్ర‌త్యామ్నాయాలు ఇవీ..

చైనీస్ ఎలక్ట్రానిక్స్ సంస్థ షియోమి ఎంఐ టీవీ 4ఏ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని సూప‌ర్ ఫీచ‌ర్స్‌తో, అంద‌రికీ అందుబాటు ధ‌ర‌లో లాంచ్ చేసింది.       సూప‌ర్ హెచ్‌డీ డిస్‌ప్లేతో, స్మార్ట్‌టీవీకి ఉండాల్సిన అత్యుత్తమ ఫీచ‌ర్ల‌తో కేవ‌లం 13,999 రూపాయ‌ల‌కే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఎంఐ ఫోన్ల‌లాగానే దీన్ని కూడా ప్ర‌స్తుతం ఫ్లాష్ సేల్‌లోనే  అమ్ముతోంది. ఎంఐ ఫ్లాష్ సేల్‌లో ఏదైనా ప్రొడ‌క్ట్ కొనాలంటే ఎంత క‌ష్ట‌మో దాన్ని ప్ర‌య‌త్నించిన వాళ్లంద‌రికీ తెలుసు. నిమిషాల్లోనే స్టాక్ అంతా అయిపోతుంది. మ‌ళ్లీ ఫ్లాష్ సేల్ వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉండాల్సిందే. ఇలా టైమ్ వెయిటింగ్ చేయ‌డం ఇష్టం లేనివాళ్లకు ఎంఐ స్మార్ట్ టీవీ స్థాయిలోనే ఉండే 5 టీవీల వివ‌రాలు ఇక్క‌డ ఇస్తున్నాం. 

థామ్స‌న్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ (Thomson LED Smart TV B9 80cm 32”)
ఫ్రాన్స్‌కు చెందిన టెక్నిక‌ల‌ర్ కంపెనీ ఈ థామ్స‌న్ టీవీల‌ను త‌యారు చేసింది. 32 అంగుళాల ఈ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఏప్రిల్‌లో రిలీజ‌యింది.1366 x 768 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో వ‌చ్చిన హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్క్రీన్, 450 నిట్స్ బ్రైట్‌నెస్‌, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌తో వ‌చ్చిన ఈ టీవీలో  స్మార్ట్ ఫీచ‌ర్ల‌ను వాడుకునే కార్టెక్స్ ఏ530 ప్రాసెస‌ర్‌, మాలీ T720MP2 జీపీయూ ఉన్నాయి. 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దొరుకుతుంది. ధ‌ర 13,499. అయితే ఎంఐ టీవీలాగే ఇది కూడా ఫ్లాష్ సేల్‌లోనే అమ్ముతున్నారు.అయితే ఎంఐ అంత క్రేజ్ లేదు కాబ‌ట్టి ఈజీగా దొరుకుతుంది. ఈ నెల 10న ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లాష్ సేల్ ద్వారా కొనుక్కోవ‌చ్చు. 

మైక్రోమ్యాక్స్ 81 సెంమీ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ (Micromax 81cm HD Ready LED Smart TV 
మైక్రోమ్యాక్స్ నుంచి వ‌చ్చిన ఈ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ చాలా ఫీచ‌ర్ల‌లో ఎంఐ టీవీ 4ఏను పోలి ఉంది. 1366 x 768 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో వ‌చ్చిన హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్క్రీన్, 250 నిట్స్ బ్రైట్‌నెస్‌, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌తో వ‌చ్చిన ఈ టీవీలో  స్మార్ట్ ఫీచ‌ర్ల‌ను వాడుకునేందుకు స్మార్ట్‌ఫోన్ క‌నెక్ట్‌, స్మార్ట్ షేర్‌, వైఫై డెరెక్ట్ ఫీచ‌ర్లున్నాయి. డిస్‌ప్లే మిర్ర‌రింగ్‌, ఎంహెచ్ఎల్‌, ఫ్యూచ‌ర్‌రెడీ  ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.  ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది. మోడ‌ల్ CanvasS2 ధ‌ర 16,999. 

మిటాషీ 80 సెం.మీ. హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ( Mitashi 80.01cm HD Ready LED Smart TV)
మిటాషీ 31.5 అంగుళాల హెచ్‌డీ రెడీ  ఎల్ఈడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో 1366 x 768 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో స్క్రీన్ ఉంది.4000:1 కాంట్రాస్ట్ రేషియో, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ దీని ప్ర‌త్యేక‌త‌లు వ‌చ్చిన ఈ టీవీలో  స్మార్ట్ ఫీచ‌ర్ల‌ను వాడుకునే కార్టెక్స్ ఏ530 ప్రాసెస‌ర్‌, మాలీ T720MP2 జీపీయూ ఉన్నాయి. డ్యూయ‌ల్ కోర్ 1.5 గిగా హెర్ట్జ్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్,8జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్నాయి. బిల్ట్ ఇన్ వైఫై స‌పోర్ట్‌, ఎథ‌ర్నెట్ పోర్ట్ కూడా ఇచ్చారు. మోడ‌ల్ పేరు MiDE032v02 HS. ధ‌ర 15,999. 

వియూ 32 ఇంచెస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ (Vu 80cm HD Ready LED Smart TV)
ఫీచ‌ర్ల విష‌యంలో వియూ కూడా ఎంఐ టీవీ 4ఏతో ఈక్వ‌ల్‌గానే ఉంది. 32 అంగుళాల హెచ్‌డీ రెడీ  ఎల్ఈడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో 1366 x 768 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో స్క్రీన్ ఉంది. 1:1 పిక్సెల్ మ్యాపింగ్‌, బ్యాక్‌లైట్ కంట్రోల్‌, డిజిట‌ల్ నాయిస్ రిడ‌క్ష‌న్ దీని ప్ర‌త్యేక‌త‌లు. బిల్ట్ ఇన్ వైఫై స‌పోర్ట్‌, ఎథ‌ర్నెట్ పోర్ట్ కూడా ఇచ్చారు.  యాప్ స్టోర్‌, నెట్ ప్లిక్స్ధ‌, ఇంట‌ర్నెట్ టెలివిజ‌న్ వంటి స్మార్ట్ ఫీచ‌ర్లు దీనికి ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్‌లు . మోడ‌ల్ నేమ్ Vu32D6475_HD smart ధ‌ర 16,999. 

కొడాక్ 32 ఇంచెస్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ  Kodak Smart TV 32" 
ఫీచ‌ర్ల విష‌యంలో పైన చెప్పిన టీవీల్లానే ఉంది. 32 అంగుళాల హెచ్‌డీ రెడీ  ఎల్ఈడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో 1366 x 768 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్‌తో స్క్రీన్ ఉంది.  యాంటీగ్లేర్ ప్యానెల్, యూ ట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రీ లోడెడ్ యాప్స్  దీని ప్ర‌త్యేక‌త‌లు. ఏఆర్ఎం కార్టెక్స్ ఏ7 ప్రాసెస‌ర్‌, 1జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉన్నాయి. మోడ‌ల్ నేమ్ 32HDXSMART ధ‌ర 14,999. 

జన రంజకమైన వార్తలు