ఆధునిక సాంకేతిక యుగంలో మనిషికి ఉపయోగపడే సాధనాలు ఎన్నో వచ్చాయి. వస్తున్నాయి. బిజీ బిజీగా ఉండే లైఫ్‌స్టయిల్‌లో అందరికి ఉపయోగపడేలా కొత్త కొత్త సాంకేతికత మనకు అందుబాటులోకి వస్తోంది. వీటితో మన పనులు మరింత సులభతరం అవుతున్నాయి. సమయం, ఎనర్జీ రెండూ ఆదా అవుతున్నాయి. అంతేకాదు ఖర్చులు కూడా కలిసొస్తున్నాయి. రోజుకో గాడ్జెట్ మార్కెట్లోకి వస్తోంది. ప్రతి గాడ్జెట్ ఎంతో ఉపయోగపడేదే. మన పనులను మరింత ఈజీ చేసేదే. మనుషుల ఏకాగ్రతను పెంచే, ఒత్తిడిని తగ్గించే గాడ్జెట్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అలా అందుబాటులో ఉన్న ఐదు గాడ్జెట్లేమిటో చూద్దామా!
జెన్‌సోరియమ్ బియింగ్
మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మానసిక స్థితిని ట్రాక్ చేయడానికి జెన్‌సోరియం బియింగ్ బాగా ఉపయోగపడుతుంది. మనకు ఉపయోగపడే ఒత్తిడి, మనకు ప్రమాదకమైన ఒత్తుడులను గుర్తించి మనకు సలహాలు అందించడం ఈ గాడ్జెట్ ప్రత్యేకత. అంటే మీరు ప్రమాదకరమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంటే వెంటనే దాని నుంచి బయటపడేందుకు మీకో అవకాశం లభిస్తుంది. అంతేకాదు మీ హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్‌లను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం దీని ప్రత్యేకత. మన స్లీప్‌ను కూడా ఇది ట్రాక్ చేస్తుంది. మీలో ఒత్తిడి లెవల్స్ ఎలా ఉన్నాయి చెబుతుంది. రోజుకు మీరెంత దూరం నడిచారో, ఎన్ని కేలరీలు ఖర్చు చేశారో, మీ బాడీ వేగం ఎంతో అన్ని వివరాలను అందిస్తుంది.
స్పయిర్
ఇది కూడా జెన్‌సోరియమ్ బియింగ్ లాంటిదే. మీ ఒత్తిడి లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి ఈ గాడ్జెట్ మనకు ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తుంది. మీ శ్వాస ఎలా ఉందో కూడా ఇది మానిటర్ చేస్తుంది. రియల్‌టైమ్‌లో మీ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చెప్పడం దీని స్పెషాలిటీ. మీకు ఒత్తిడి అధికమైతే ఇది వెంటనే మీ ఫోన్‌కు నోటిఫికేషన్ పంపిస్తుంది. అంతేకాదు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, మెడిటేషన్ టిప్స్‌ను అందిస్తుంది.
రింగ్లి గో
రింగ్లి కంపెనీ తయారు చేసిన ఈ కొత్త స్మార్ట్ బ్రెస్‌లెట్ మన ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేస్తుంది. రోజుకు ఎన్ని అడుగులు వేశారు.. ఎంత దూరం కవర్ చేశారు? ఎంత దూరం ప్రయాణించారు? ఎన్ని కేలరీలు బర్న్ అయ్యాయి లాంటి కీలక విషయాలను తెలియజేయడానికి రింగ్లి గో బ్రెస్‌లెట్ బాగా ఉపయోగపడుతుంది. మనకు మెడిటేషన్ టిప్స్ అందిస్తుంది. మీ ఫిజికల్ ఫిట్‌నెస్ మాత్రమే కాదు మెంటల్ ఫిట్‌నెస్‌ను కూడా ఇది మానిటర్ చేస్తుంది. రకరకాల మోడల్స్‌లోఅందరికి నచ్చేలా ఈ బ్రెస్‌లెట్‌ను తయారు చేశారు.
మ్యూజ్
ఇది ఓ హెడ్ బ్యాండ్. వాతావరణంలో ఉన్న రకరకాల సౌండ్స్‌కు అనుగుణంగా మ్యూజ్ పని చేస్తుంది. మన తలకు దీన్ని ధరిస్తే చాలు. మెడిటేషన్ చేసే సమయంలో మనకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే ప్రశాంతమైన గాలులు ఉన్న ధ్వనులను ఇది ప్లే చేస్తుంది. మీ మనసు మరింత యాక్టివ్‌గా ఉంటే ఈ ధ్వనులు మరింత ఎక్కువగా వస్తాయి. దీని వల్ల మన మానసిక స్థితి తెలుసుకోవడం చాలా సులభం.
సోనా
సోనా అనేది ఒక బ్రెస్‌లెట్. మెడిటేషన్ సెషన్స్ ద్వారా ఇది మనలో ఉన్న ఒత్తిడి బాగా తగ్గిస్తుంది. ఐదు మెడిటేషన్ సెషన్లు దీనిలో ఉంటాయి. దీని వల్ల మీ పని మీద, మీ శ్వాస మీద ఏకాగ్రత చూపించడం సులభం. సైంటిస్టుల ద్వారా డిజైన్ చేయబడిన ఈ సెషన్లు మీ బాడీ, మైండ్ రెండూ ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. మీలో ఒత్తిడి, కంగారులను తగ్గిస్తాయి. అంతేకాదు మీ దినచర్య గురించి ఎప్పటికప్పుడు సోనా మీకు ఫీడ్‌బ్యాక్ అందిస్తుంది.