బిజినెస్ లాప్ టాప్ లు సాధారణంగా అంత ఆకట్టుకునే డిజైన్ లలో లభించవు. వాటి దృష్టి అంతా పనితీరు మీద మాత్రమే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుంది. కానీ లేటెస్ట్ గా వస్తున్న బిజినెస్ లాప్ టాప్ లు మాత్రం చాలా అందమైన డిజైన్ లలో లభిస్తున్నాయి. అది కూడా పెర్ఫార్మన్స్, సెక్యూరిటీ, డేటా ప్రైవసీ లాంటి అంశాలలో ఏ మాత్రం రాజీ పడకుండా అందమైన డిజైన్ లలో ఇవి లభిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని ఇక్కడ చూద్దాం. లెనోవా థింక్ పాడ్ X1 కార్బన్ దీని ధర రూ 1,28,400/- లు ఉంటుంది. ఇది ఇంటెల్ కోర్ i5-6300U ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇది 8 GB RAM మరియు 256GB స్టోరేజ్ ని కలిగిఉంటుంది. దీని బాటరీ లైఫ్ 10 గంటల వరకూ ఉంటుంది. ఇది 1920x1080 పిక్సెల్ తో కూడిన ఫుల్ HD IPS డిస్ప్లే ను కలిగిఉంటుంది. దీని బరువు 1.1 kg ఉంటుంది. దీని తికెస్ట్ పాయింట్ దగ్గర మందం 16 mm ఉంటుంది. కార్బన్ ఫైబరు రీ ఇన్ ఫోర్సుడ్ లిద్ మరియు మెగ్నీషియం కేసింగ్ తో ఇది లభిస్తుంది. డెల్ XPS 13 దీని ధర రూ 1,28,350/- లు ఉంటుంది. ఇది 13 ఇంచ్ క్వాడ్ HD రిసోల్యూషన్ డిస్ప్లే ని కలిగిఉంటుంది. ఇది 15mm మందం తో 1.18 kg ల బరువుతో ఉంటుంది. ఇది అల్యూమినియం సింగల్ బ్లాక్ తో నిర్మితం అయి ఉంది. ఇది డ్రాప్ బాక్స్ లో 20GB క్లౌడ్ స్టోరేజ్ ను కలిగి ఉంది. దీనికి ఉన్న ఎన్ క్రిప్షన్ మరియు అతెంటికేషన్ లు మీ డేటా ను సేఫ్ గా ఉంచుతాయి. అన్నింటికీ మించి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. HP ఎలైట్ బుక్ ఫోలియో దీని ధర రూ 1,27,200/- లు ఉంటుంది. ఇది కేవలం 12 mm మందంతో 1 kg బరువులో లభిస్తుంది. ఇది బిజినెస్ లాప్ టాప్ లలోనే అత్యంత తేలికైన లాప్ టాప్. ఇది ఇంటెల్ కోర్ m5-6Y54 ప్రాసెసర్, 8GB RAM లో లభిస్తుంది. 256 GB సాలిడ్ స్టేట్ డ్రైవ్ ను కలిగి ఉంటుంది.దీనివలన యాప్ లోడ్ టైం తక్కువ అవ్వడమే గాక అత్యుత్తమ మల్టీ టాస్కింగ్ ను అందిస్తుంది. 12.5 ఇంచ్ డిస్ప్లే లో ఇది ఉంటుంది. దీనికి ఉన్న సౌకర్యవంతమైన డిస్ప్లే, కాంపాక్ట్ డిజైన్, అద్భుతమైన కీ బోర్డు మరియు స్థిరమైన బాటరీ లైఫ్ వలన ఇది ప్రత్యేకంగా నిలబడింది. ఆపిల్ మాక్ బుక్ ప్రో విత్ రెటీనా డిస్ప్లే దీని ధర రూ 1,06,900/- లు ఉంటుంది. ఇది మాక్ OS సియెరా ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ పై పనిచేస్తూ 8GB RAM మరియు 128GB ఫ్లాష్ స్టోరేజ్ ను ఇది కలిగిఉంటుంది. 13.3 ఇంచ్ IPS డిస్ప్లే మరియు 2,560x1,600 రిసోల్యూషన్ ను కలిగిఉంటుంది. కలర్ రీ ప్రొడక్షన్ లో అత్యంత ఖచ్చితంగా ఉంటుంది. దీనికి ఉన్న మరొక ప్రత్యేకత ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రోజంతా వస్తుంది. మిగతా లాప్ టాప్ లతో పోలిస్తే ఈ అంశం లో ఇది ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. ఆసస్ జెన్ బుక్ ఫ్లిప్ దీని ధర రూ 55,640/- లు ఉంటుంది. ఇది 360 డిగ్రీ ల కోణం లో తిప్పగలిగే సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. అంటే దీనిని మనం ఎలాగైనా తిప్పుకోవచ్చు అన్నమాట. ఇది అల్ట్రా లో పవర్ కన్సుమింగ్ ఇంటెల్ కోర్ M6Y30 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. విండోస్ 10 పనిచేస్తూ 4 GB RAM ను కలిగిఉంటుంది.దీని ఫ్లాష్ స్టోరేజ్ 512 GB ఉంటుంది. 13.3ఇంచ్ డిస్ప్లే ను కలిగిఉంటుంది. ఇది అల్యూమినియం చాసిస్ ను కలిగిఉంటుంది. |