స్మార్ట ఫోన్ల వేగం రోజురోజుకీ పెరిగిపోతోంది. 6జీబీ ర్యామ్ తో ఫోన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో 'ఎక్స్‌ప్లే 5, ఎక్స్‌ప్లే 5 ఎలైట్' పేరిట రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఎక్స్‌ప్లే 5 రూ.38,200 ధరకు, ఎక్స్‌ప్లే 5 ఎలైట్ రూ.44,300 ధరకు వినియోగదారులకు త్వరలో లభ్యం కానున్నాయి. కాగా ఎక్స్‌ప్లే 5 సిరీస్ ఫోన్లలో 6జీబీ ర్యామ్ ఉంది. ప్రపంచంలో 6జీబీ ర్యామ్ తో వస్తున్న మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. వివో ఎక్స్ ప్లే 5లో ఇంటర్నల్ మెమొరీ 128 జీబీ కావడం మరో ప్రత్యేకత. |
|
వివో ఎక్స్‌ప్లే 5 ఫీచర్లు.. - ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, ఫన్ టచ్ ఓఎస్ 2.5.1 - 5.43 ఇంచ్ కర్వ్‌డ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్ర్కీన్ రిజల్యూషన్ - 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ - 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా - 3600 ఎంఏహెచ్ బ్యాటరీ - 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ - యూఎస్‌బీ ఓటీజీ, వైఫై 802.11 ఏసీ బ్లూటూత్ 4.2, - 4జీ ఎల్‌టీఈ - 1.8 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ - ఫింగర్‌ప్రింట్ సెన్సార్ |
|
వివో ఎక్స్ ప్లే 5 ఎలైట్ ప్రత్యేకతలు.. - డ్యూయల్ కర్వ్ డ్ 5.43 ఇంచెస్ అమోలెడ్ క్వాడ్ హెచ్ డీ స్ర్కీన్.. గొరిల్లా గ్లాస్ 4 - స్నాప్ డ్రాగ్ 820 చిప్ సెట్ - 6 జీబీ ర్యామ్ - 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా - 3600 ఎంఏహెచ్ బ్యాటరీ - 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ |
|