ఖరీదైన స్మార్టు ఫోన్ ఒకటి త్వరలో మార్కెట్లోకి రానుంది. సిరిన్ ల్యాబ్సు దీన్ని మరో నెల రోజుల్లో మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘సొలారిన్’ పేరిట మార్కెట్‌లోకి వస్తున్న ఈ ఫోన్ ధర 10 వేల డాలర్లు... అంటే ఆరున్నర లక్షల రూపాయల పైనే ఉంటుంది. లేటెస్టు టెక్నాలజీతో పాటు వ్యక్తిగత అంశాల భద్రతకు పెద్ద పీట వేస్తూ ఇందులో సెట్టింగ్సు ఉంటాయి. ఇజ్రాయల్ కు చెదిన సిరిన్ ల్యాబ్సు దీన్ని తయారుచేసింది. 2013లో ప్రారంభమైన సిరిన్ ల్యాబ్స్ కొద్దికాలంలోనే లగ్జరీ ఫోన్లకు చిరునామాగా మారిపోయింది. ఇటీవలే 72 మిలియన్ డాలర్ల నిధులను కూడా సేకరించింది ఈ స్టార్టప్. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్టుఫోన్ పరిచయానికి సిరిన్ ల్యాబ్స్ సిద్ధమవగా, తొలి సొలారిన్ స్మార్ట్ఫోన్ లండన్ రిటైల్ స్టోర్‌లో అందుబాటులో ఉండే వీలుంది. అయితే తొలుత తమ ఈ-కామర్స్ సైట్‌లోనే అమ్మకాలు మొదలవుతాయని సిరిన్ ల్యాబ్సు చెబుతోంది. అంతేకాకుండా దీని విక్రయం కోసం యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా దేశాల్లో రిటైల్ స్టోర్లను తెరవాలనుకుంటోంది. కాగా సోలారిన్ తయారీ కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ లోహాలను వినియోగించారట.. ఇదిలావుంటే లగ్జరీ స్మార్ట్ఫోన్లు ఇప్పుడే వస్తున్నవి కావు. కాగా సోలారిన్ కంటే ఖరీదైన ఫోన్లు గతంలో వచ్చాయి. 2006 లోనే నోకియా ‘సిగ్నేచర్ కోబ్రా’ పేరిట 3,10,000 డాలర్ల (రూ. 2 కోట్ల పైమాటే) రిలీజ్ చేసిన ఫోన్ బాగా ఖరీదైంది. 2011లో 5,000 డాలర్లతో ‘కన్స్‌టెల్లేషన్’ అనే మరో స్మార్ట్ఫోన్‌నూ తెచ్చింది. 2012లో నోకియా లగ్జరీ బ్రాండైన వెర్టు.. ‘వెర్టు టి’ పేరుతో తొలి అండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌ను పరిచయం చేసింది. భారత్‌లో దీని ధర 6,49,990 రూపాయలు. స్విట్జర్లాండ్‌కు చెందిన గోల్డ్‌విష్ సంస్థ ‘లెమిల్లియన్ పీస్ యూనిక్’ పేరుతో ఏకంగా 13 లక్షల డాలర్ల (దాదాపు రూ. 9 కోట్లు) ధరతో ఓ స్మార్ట్ఫోన్‌ను ఇప్పటికే పరిచయం చేసింది. వజ్రాలు, ప్లాటినం, టైటానియంతో దీన్ని రూపొందించింది. |