మీరు డయాబ్లో III లేదా మాక్స్ పేన్ III లాంటి గేమింగ్ డివైస్ లను కొన్నారనుకోండి. అందులో అత్యుత్తమ క్వాలిటీ గేమింగ్ ఫీచర్ లు ఉంటాయి. అల్ట్రా హై సెట్టింగ్ లు, 100 fps లాంటి ఫీచర్లు ఈ గేమ్ లలో ఉంటాయి. ఇంతమంచి ఫీచర్ లు ఉన్న గేమ్ ల యొక్క అనుభూతిని అనుభవించాలంటే దానికి తగ్గ స్క్రీన్ సైజు కూడా ఉండాలి. మీ కంప్యూటర్ యొక్క మానిటర్ సైజు 21 ఇంచెస్ అయితే వీటిని అంతగా ఆస్వాదించలేరు. అదే టీవీ స్క్రీన్ ల మాదిరిగా 32 ఇంచెస్ స్క్రీన్ అయితే వీటికి తగ్గట్లు గా ఉంటుంది. అదే మీ వద్ద ఒక కూల్ HD టీవీ కనుక ఉన్నట్లయితే ఇక మీరు ఎంచక్కా ఈ గేమ్ ల లోకం లో విహరించవచ్చు. ఇది కేవలం గేమ్ లకు మాత్రమే పరిమితం కాదు. చాలా మందికి తమ కంప్యూటర్ ల యొక్క మానిటర్ లు పెద్ద సైజు లో ఉంటె బాగుంటుందనీ అనుకుంటారు. కానీ ప్రస్తుతం లభిస్తున్న కంప్యూటర్ ల యొక్క మానిటర్ లు అంత పెద్ద సైజు లో లభించడం దాదాపు కష్టమే. మరి ఇలాంటి పరిస్థితులలో మన ఇంట్లో ఉండే టీవీ స్క్రీన్ నే కంప్యూటర్ మానిటర్ గా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. గతం లో కూడా టీవీ లను కంప్యూటర్ లకు కనెక్ట్ చేయడం అనే కాన్సెప్ట్ తో కొన్ని ఆవిష్కరణ లు జరిగాయి కానీ నాసిరకమైన వీడియో క్వాలిటీ ని అందించడం తో ఇవి వైఫల్యం చెందాయి. దీనికి కారణం తక్కువ నాణ్యత కలిగిన కనెక్టర్ లలు, మరియు టీవీ లకు ఉండే లో రిసోల్యూషన్. అప్పట్లో టీవీ లకు రిసోల్యూషన్ తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం వస్తున్న టీవీ లు అత్యాధునిక టెక్నాలజీ తో వస్తున్నాయి. ఫుల్ HD రిసోల్యూషన్ టీవీ లు అనేకం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి అత్యంత స్పష్టమైన ఇమేజ్ ను అందిస్తున్నాయి. స్క్రీన్ ల కు ఉండే పెద్ద పరిమాణం అది అందించే నాణ్యత ను ఏ మాత్రం ప్రభావితం చేయడం లేదు కాబట్టే ఇవి నాణ్యమైన వీడియో లను అందించగలుగుతున్నాయి. అంతేగాక HDMI, డిస్ప్లే పోర్ట్ లాంటి సరికొత్త కనెక్టర్ లు కూడా నేడు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యం లో మీ టీవీ స్క్రీన్ లను కంప్యూటర్ లుగా మార్చే కొన్ని పద్దతుల గురించి ఈ రోజు ఆర్టికల్ లో చూద్దాం. HDMI HDMI తన పోటీదారులతో ఒక అంశం లో చాలా ముందు ఉంది. అదేమిటి అంటే ఇది ఒకే కేబుల్ ద్వారా వీడియో మరియు ఆడియో సిగ్నల్ లను ప్రసారం చేయగలదు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ కేబుల్ లు లేకుండా నీట్ గా ఉండాలి అనుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది. కాకపోతే ఇది పనిచేయాలంటే మీ టీవీ కి HDMI కనెక్టివిటీఉండాలి మరియు మీ వీడియో కార్డు కూడా HDMI స్లాట్ ను కలిగి ఉండాలి. కొన్ని వీడియో కార్డు లు HDMI ను కలిగిఉండవు కానీ DVI, డిస్ప్లే పోర్ట్ , మిని HDMI లాంటి అడాప్టర్ లను వాడడం వలన వీటిని డిజిటల్ సిగ్నల్ లు గా మార్చవచ్చు. HDMI అనేది మిగతా వాటికంటే బెటర్ పిక్చర్ క్వాలిటీ ని అందిస్తుంది అంటే నమ్మి మోసపోవద్దు ఎందుకంటే HDMI కీ మిగతా వాటికీ ఉన్న ఏకైక తేడా ఏమిటంటే ఇది ఆడియో తో పాటు వీడియో ను కూడా క్యారీ చేయగలదు. దీనికి ఉన్న ఏకైక ప్రతికూలత ఏమిటంటే దీని స్క్రూ లు క్లాంప్ లు అంత గట్టిగా ఉండవు. కేబుల్ ను కానీ టీవీ ని కానీ కొంచెం కదిపినా సరే రెండు మూడు నిమిషాలు సిగ్నల్ బ్రేక్ అవుతుంది. కాబట్టి దీనిని వాడేటపుడు కేబుల్ ను తాకకుండా ఉంటేనే మంచిది. DVI/డిస్ప్లే పోర్ట్ HDMI లాంటి కనెక్షన్ లేనివారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం కాగలదు. తేడా ఏమిటంటే సౌండ్ కోసం మనం వేరొక కేబుల్ ను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ విషయానికొస్తే ఇది కూడా క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ ను అందిస్తుంది. ఇది చాలా సెక్యూర్ గా ఉంటుంది. మధ్యలో సిగ్నల్ పోవడం లాంటివి ఇందులో ఉండవు. దీనిని వాడడం అనేది ఒక మంచి ఆలోచనే. డిస్ప్లే పోర్ట్ కూడా ఇంచుమించు ఇలాంటి ఫీచర్ లనే కలిగిఉంటుంది కావున ఈ రెండింటిలో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవచ్చు. VGA VGA అంటే వీడియో గ్రాఫిక్స్ ఎరే. పాత గ్రాఫిక్ కార్డు ల లోనూ మరియు మానిటర్ లలోనూ దీనిని ఎక్కువగా ఉపయోగించారు. ఇది అనలాగ్ సిగ్నల్ ను కలిగిఉంటుంది. ఇది ఎక్కువ దూరాలనుండి సిగ్నల్ లను లాగలేదు. సరికొత్త టెక్నాలజీ లతో పోలిస్తే ఇది చాలా తక్కువ నాణ్యంగా ఉంటుంది. మిగతావి ఏవీ అందుబాటులో లేకపోతే మీరు దీనిని ఉపయోగించవచ్చు. ఇది ఆడియో ను సపోర్ట్ చేయదు కాబట్టి దీనికి విడిగా కేబుల్ ను వాడాలి. ఇది లో క్వాలిటీ వీడియో ను అందిస్తుంది. S- వీడియో ఈ S- వీడియో కేబుల్ లను పాత వీడియో కార్డు లలో చూడవచ్చు. ఇవి వీడియో కనెక్టర్ ఉంది ఒక స్ప్లిట్టర్ ను ఉపయోగించుకుంటాయి. సౌండ్ ను క్యారీ చేయవు కానీ అత్యుత్తమ వీడియో క్వాలిటీ ని అందిస్తాయి. కానీ రిసోల్యూషన్ తోనే అసలు సమస్య. పాత టీవీ లు లైన్ సెట్ అప్ ను ఉపయోగించుకుంటాయి కానీ ప్రస్తుతం వస్తున్న టీవీ లు పిక్సెల్ ఫార్మాట్ లో లభిస్తున్నాయి. ఇందులో మీరు 700 వెర్టికల్ లైన్ ల రిసోల్యూషన్ వరకూ చూడవచ్చు. వైర్ లెస్ /LAN ప్రస్తుతo లభిస్తున్న టీవీ లలో ఎక్కువ శాతం వైర్ లెస్ లేదా LAN ను కలిగిఉన్నాయి. ఇది కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటుంది అంతేగాక PC లలాంటి మిగతా మీడియా డివైస్ లకు కూడా కనెక్టివిటీ ని అందిస్తుంది. ఇది వైర్ లెస్ కనెక్షన్, మీరు వీడియో లను స్ట్రీమింగ్ చేయవచ్చు. అయితే గేమింగ్ కు ఇది అంత అనుకూలం కాకపోవచ్చు. ఇది ఎటువంటి కేబుల్ లు లేకుండా మీ రూమ్ ను శుభ్రం గా ఉంచుతుంది.pc, లాప్ టాప్ మరియు ఇతర పరికరాల కనెక్టివిటీ కోసం వైర్ లెస్ డాంగిల్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని స్ట్రీమింగ్ యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. |
"
"