కారుచౌకగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అంటూ ప్రపంచ మొబైల్ ఫోన్ల మార్కెట్లో సంచలనం సృష్టించిన భారత సంస్థ రింగింగ్ బెల్స్ ఇప్పుడు మరింత సంచలన ప్రకటన చేసింది. బుధవారం సాయంత్రం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విడుదల చేశారు. ఈ ''ఫ్రీడమ్ 251''ఫోన్ ధర అందరూ అనుకుంటున్న రూ.500 కాదని... కేవలం రూ.250 మాత్రమేనని చెప్పి మరో సంచలన ప్రకటన చేసింది. అంతేకాదు... ఆ ఫోన్ ఫీచర్లు ఎలా ఉంటాయో తెలిసి ప్రపంచమంతా షాక్ అవుతోంది. రూ.251 ఫోన్ ఫీచర్లు - 1 జీబీ ర్యాం - 4 అంగుళాల టచ్ స్ర్కీన్ - 8 జీబీ ఇంటర్నల్ మెమరీ - 3.2 రియర్ కెమేరా, 0.3 సెల్ఫీ కెమేరా - 1450 ఎంఏహెచ్ బ్యాటరీ నిజానికి 8 జీబీ మెమరీ కార్డు కానీ, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా 251 రూపాయలకు దొరకదు. అలాంటిది ఏకంగా ఫోనే 251 రూపాయలకు దొరనుండడం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కాగా ఈ ఫోన్ ఎక్కడ దొరుకుతుంది... ఎప్పడు విక్రయిస్తారు అంటూ జనం ఇప్పటికే చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. యువత దీనికోసం ఇంటర్నెట్లో తెగ వెతికేస్తోంది. గూగుల్ సెర్చిలో రెండు రోజులుగా టాప్ సెర్చింగ్ వర్డ్ అట. ఫ్రీడమ్ 251 ఫోన్ ను గురువారం ఉదయం 6 గంటల నుంచి విక్రయిస్తారు. పలు ఈకామర్స్ వైబ్ సైట్లలో దీన్ని అందుబాటులో ఉంచబోతున్నారు. ఫిబ్రవరి 21 రాత్రి 8 గంటల వరకు అయిదు రోజుల పాటు ఈ విక్రయాలు ఉంటాయి. అనంతరం కూడా మరికొన్ని విడతల్లో రిజిస్ట్రేషన్లు తీసుకుంటారు. ఇలా జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అందరికీ దీన్ని విక్రయిస్తారు. అనంతరం బహిరంగ మార్కెట్లో విడుదల చేస్తారు. మొత్తానికి మేకిన్ ఇండియా మహిమతో స్మార్ట్ ఫోన్ పూర్తిగా చౌకగా మారిపోయింది. |