• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్ లను కంప్యూటర్ లాగా మార్చే జిడే ఒ.ఎస్

స్మార్ట్ ఫోన్బ్ లను ఒక ఉత్కృష్టమైన కంప్యూటింగ్ డివైస్ ల లాగా మార్చివేయాలనే ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ యొక్క విండోస్ 10 కానీ, కెననికల్ యొక్క ఉబుంటు లు ఈ కోవకు చెందినవే. అయితే వాటి ప్లాట్ ఫాం లపై తగినంత సంఖ్య లో వినియోగదారులు లేకపోవడం వలన ఇవి ఒక విఫలయత్నాలు గానే మిగిలిపోయాయి.అయితే ఆండ్రాయిడ్ యొక్క డెస్క్ టాప్ కౌంటర్ పార్ట్ లకు పేరొందిన కంపెనీ అయిన జిడే ఒక సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ను ప్రకటించింది. ఈ ఆపరేటింగ్ సిస్టం ఒక డాక్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ లను మానిటర్ లకు కనెక్ట్ చేస్తుంది.

ఈ ఆపరేటింగ్ సిస్టం ను రెమిక్స్ ఒఎస్ ఆన్ మొబైల్ ( ROM ) అని అంటారు. ఇది డాకబుల్ కనెక్షన్ ను డ్రైవ్ చేసే రెమిక్స్ సింగులారిటీ తో వస్తుంది. దీని కాన్సెప్ట్ కొత్తగా ఏమీ ఉండదు. మొబైల్ ను పీసీ కి కనెక్ట్ చేసే మిగతా సర్వీస్ లలానే ఇది కూడా ఉంటుంది. ఎలాగైతే మీరు మీ ఫోన్ ను మానిటర్, కీ బోర్డు, లేదా మౌస్ కు డాక్ ద్వారా కనెక్ట్ చేసి గూగుల్ డాక్స్ లేదా క్లాష్ అఫ్ క్లాన్స్ అనే యాప్ ల ద్వారా మీ ఆండ్రాయిడ్ ను ఒక పూర్తీ స్థాయి డెస్క్ టాప్ లాగా వాడుకుంటారో ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. మీకు కంప్యూటర్ మోడ్ ఇష్టం లేకపోతే స్మార్ట్ ఫోన్ ను స్క్రీన్ కు ప్లగ్ చేసి ఆండ్రాయిడ్ పోవేరేడ్ టెలివిజన్ అనుభూతిని పొందవచ్చు.

అయితే కొన్ని ముఖ్యమైన ఫీచర్ ల విషయం లో ఇది మిగతా వాటికంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఇది విండోస్ 10 కంటే కూడా విశిష్టంగా ఉంటుంది. ఈ రెమిక్స్ ఒఎస్ ఆండ్రాయిడ్ కు వీలైనంత సన్నిహితంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. అయితే దీని పరిమితులు దీనికి ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది పరిమిత పవర్ మరియు మీ చేతిలో పట్టే సైజు లో ఉండే దానికి కావలసిన ఫీచర్ లు కొన్ని దీనికి లేకపోవడం మరియు లాప్ టాప్ కు కంపాటిబుల్ అయ్యే వెర్షన్ ఉన్నప్పటికీ దానికి మరొక వాదన ఉండడం లాంటివి కొన్ని ప్రతికూలాంశాలు గా ఉన్నప్పటికీ సానుకూలాంశాలు కూడా చాలానే ఉన్నాయి.

జిడే యొక్క సహా వ్యవస్థాపుకుడు అయిన డేవిడ్ కో మాట్లాడుతూ “ రానున్న 5 సంవత్సరాలలో సుమారుగా 5 బిలియన్లమంది వినియోగదారులు ఆన్ లైన్ లోనికి రానున్నారు, వారు ఆన్ లైన్ లోనికి అచ్చే సరికి వారి మొదటి ఎంపిక స్మార్ట్ ఫోన్ గా ఉండబోతుంది.  అందులో కూడా అందుబాటు ధర లో ఉండే స్మార్ట్ ఫోన్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్ నే అందరూ ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యం లో మీ ఫోన్ కనుక మీ పీసీ ని రీ ప్లేస్ చేయగలిగితే ఉత్పాదనలో భారీ మార్పు కనపడే అవకాశంఉంది, కాబట్టి దీనిని మరింత ప్రయోజనకరంగా ఉండేలా తీర్చిదిద్దనున్నాము”. అని చెప్పారు.

కస్టమర్ లకు ఈ టెక్నాలజీ ని చేరువ చేసేందుకు అవసరమైన హార్డ్ వేర్ పార్టనర్ ల కోసం ప్రస్తుతం జిడే అన్వేషిస్తుంది. అంతేగాక ఈ ROM అనేది ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ రెమిక్స్ సింగులారిటీ అనేది ఈ వేసవి లో విడుదల కానుంది. దీనికి పోటీగా సామ్సంగ్ కూడా తన గాలక్సీ లైన్ అప్ కోసం సామ్సంగ్ DeX అనే మరొక ఒఎస్ ను రంగం లోనికి దించనున్నట్లు సమాచారం. దీని ఫీచర్ లు కూడా రెమిక్స్ ను పొలిఉన్నట్లు సమాచారం. మరి ఈ విభాగం లో ఈ టెక్ సంవత్సరం ఎలా ముందుకు వెళ్ళనుందో చూడాలి.

జన రంజకమైన వార్తలు