• తాజా వార్తలు

గూగుల్ అనువాదంలో మరో 13 భాషలు...

న్ లైన్ టూల్స్ లో అగ్రగామిగా ఉన్న గూగుల్ తన సేవలను విస్తరించుకుంటూ పోతోంది. గూగుల్ అందించే గూగుల్ ట్రాన్స్ లేట్ సర్వీసెస్ ఇప్పటికే తన కచ్చితత్వం పెంచుకుని ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. భారతీయ భాషల్లో మరిన్ని భాషల్లో అనువాదానికి అవాకాశం కల్పిస్తూ గూగుల్ ట్రాన్స్ లేట్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. తాజాగా 103 భాషల్లో అనువాదానికి గూగుల్ ట్రాన్స్ లేట్ అవకాశం కల్పిస్తోంది.

ఇంతవరకు 90 భాషల మధ్య అనువాదానికి గూగుల్ ట్రాన్స్ లేట్ లో అవకాశం ఉండేది. తాజాగా వివిధ దేశాలకు చెందిన మరో 13 భాషలను చేరుస్తూ విస్తరించింది. నెటిజన్లలో 99 శాతం మంది గూగుల్ ట్రాన్స్ లేట్ యాప్ ను వినియోగిస్తున్నట్లు ఆ సంస్థ చెబుతోంది.

కొత్తగా చేరిన 13 భాషలు ఇవే..

- అమ్హారిక్

- కోర్సియాన్

- ఫ్రిజియాన్

- కిర్గిజ్

- హవాయీన్

- కుర్దిష్

- లగ్జెంబర్గిష్

- సామోయాన్

- స్కాట్స్

- గేలిక్

- సోనా

- సింధి

- పాస్తో

- గ్జోసా

కాగా కొత్తగా చేర్చిన 13 భాషల్లో భారతదేశానికి చెందిన సింధి భాషకు స్థానం దక్కింది.

కాగా కొత్తగా చేర్చిన ఈ 13 భాషల వల్ల 12 కోట్ల మందికి కొత్తగా చేరువ కావొచ్చని అంచనా. ఫిబ్రవరి 21 న ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా గూగుల్ ఈ కానుక అందిస్తోంది.

కాగా ఇప్పటికే అమెచ్చూర్ సెక్టార్ లో గూగుల్ ట్రాన్స్ లేట్ ఉపయోగం భారీ స్థాయిలో ఉంది. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు, పర భాషా వ్యక్తులతో మాట్లాడడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గూగుల్ ట్రాన్స్ లేట్ ను  ఉపయోగిస్తున్నారు. వీటిలో వ్యాఖ్యాలు, పేరాల ట్రాన్స్ లేషన్ అన్ని భాషల మధ్య కచ్చితంగా జరగనప్పటికీ, ఇంగ్లిష్ నుంచి పలు భాషలకు అనువాదం మాత్రం కచ్చితంగా ఉంటోంది. మొదట్లో గజిబిజిగా ఉన్న ఈ అనువాదాలు ఇప్పుడు దాదాపు 100 శాతం కచ్చితంగా ఉంటున్నాయి. అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు గూగుల్ ట్రాన్స్ లేషన్ సర్వీసును ఉపయోగించుకోవడం ఎక్కువైంది. ఇంకా చెప్పాలంటే గూగుల్ ట్రాన్స్ లేషన్ ఈ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది డిక్షినరీల జోలికెళ్లడం లేదు.

 

జన రంజకమైన వార్తలు