యాపిల్ మార్కెట్లో దూసుకుపోతున్న బ్రాండ్. ఏళ్ల తరబడి ఏకఛాత్రధిపత్యం ప్రదర్శిస్తున్న బ్రాండ్. ఇది ఏ ప్రొడెక్ట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినా అది సూపర్‌హిట్టే. అంతేకాదు ఏ ఆఫర్ ప్రవేశపెట్టినా అది కూడా హిట్టే. తాజాగా యాపిల్ తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే ఐక్లౌడ్‌లో తక్కువ ధరకే ఎక్కువ స్టోరేజ్‌ను ఇస్తోంది ఆ కంపెనీ. ఆ ఆఫరే 2జీ ఐక్లౌడ్ స్టోరేజ్ ప్లాన్. ఒకప్పుడు దీని ధర 19.99 డాలర్లుగా ఉండేది. ఐతే మార్కెట్లో పోటీని, మారుతున్న పరిణామాల దృష్ట్యా సాధారణంగా ఎప్పుడూ తగ్గని యాపిల్ కూడా దిగొచ్చింది. ఈ స్టోరేజ్ ప్లాన్‌ను ఏకంగా పది డాలర్లు తగ్గించి కేవలం 9.99 డాలర్లకే అందించాలని నిర్ణయించింది.
0.99 డాలర్ల నుంచి
ఐక్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌లో 9.99 డాలర్లు అనేది టాప్. ఇంకా తక్కువ రేంజ్‌లో కూడా ఈ ప్లాన్ దొరుకుతుంది. ఆరంభం సబ్‌స్క్రిప్షన్ ధర కేవలం 0.99 డాలర్లు మాత్రమే. దీనికి నెలకు 50 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఆ తర్వాత 2.99 డాలర్లు దీనికి 200 జీబీ డేటా లభిస్తుంది. ఇక 2 టెరా బైట్ ప్లాన్ కావాలంటే మాత్రం 9.99 డాలర్లు చెల్లించక తప్పదు. 2 టెరా బైట్ స్టోరేజ్‌ను ఇంత తక్కువ ధరకు అందించడం యాపిల్‌కే సాధ్యమైంది. ఫ్రీ స్టోరేజ్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని ఇది 5 జీబీగానే కొనసాగుతుందని యాపిల్ తెలిపింది. గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్‌లు కూడా దాదాపు ఇదే ధరలతో స్టోరేజ్‌ను అందిస్తున్నాయి. అయితే అన్నిటితో పోలిస్తే ఐక్లౌడ్ టాప్‌లోఉంది. మీ ఇంట్లో నలుగురు ఐక్లౌడ్ వాడుతుంటే 2 టెరా బైట్ స్టోరేజ్‌ను ఆ నలుగురు పంచుకునే ఆప్షన్ కూడా ఉంది. ఐక్లౌడ్ ఫ్యామిలీ షేరింగ్ ఫీచర్‌తో ఇది సాధ్యమవుతుంది. ఐఓఎస్ 11, మాక్ ఓఎస్ హై సియెరా కోసం తాజాగా ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు.
1 టెరా బైట్ ప్లాన్ కూడా..
మైక్రోసాఫ్ట్ ఐక్లౌడ్‌లో 1 టెరా బైట్ స్టోరేజ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఇది 6.99 డాలర్లకు దొరకుతుంది. నెలకు 6.99 డాలర్లు చెల్లించి 1 టీబీ డేటాను పొందొచ్చు. ఇది ఆఫీస్ 365 వెర్షన్‌కు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే ఎలాంటి ఛార్జీలు లేకుండా 1టీబీ ప్లాన్‌ను 2 టెరా బైట్‌గా మార్చకునే సదుపాయాన్నివినియోగదారులకు కల్పించాలని యాపిల్ నిర్ణయించింది. ఇది ఆటోమెటిక్ అప్‌డేట్. అయితే మిగిలిన సబ్‌స్క్రిప్షన్లలో యాపిల్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఏదేమైనా యాపిల్ చేసిన ఈ కొత్త అప్‌డేషన్ వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటాను కోరుకునే వారికి 9.99 డాలర్ల ఆప్షన్ వర్త్‌ఫుల్.