స్మార్టు ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు వినియోగం ఇప్పటికే మొదలైనా పానసోనిక్ మరో అడుగు ముందుకేసి దానికి మరింత అడ్వాన్సుమెంటు చూపించింది. తాజాగా అర్బో వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్ తో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సును భారీగా ఉపయోగించుకునేలా చేసింది. తాజాగా అర్బో టెక్నాలజీతో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ఎలుగా ఎక్స్ రే మాక్స్ , ఎలుగా రే ఎక్స్‌పేర్లతో వీటిని లాంచ్ చేసింది. వీటి ధరలను వరుసగా రూ. 11,499 రూ. 8,999 గా నిర్ణయించింది. కాగా ఈ నెలలోనే ఎలుగా ప్లస్ ఎక్స్, ఎలుగా ప్లస్ పేరుతో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధరలను వరుసగా రూ.10,990, రూ. 9, 690గ ప్రకటించింది. అలాగే ఫిబ్రవరిలో మూడు టఫ్‌ఫ్యాడ్ ట్యాబ్లెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా, లాజిస్టిక్, తయారీ, ఆటోమోటివ్, రిటైల్, హెల్త్‌కేర్ రంగాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ ట్యాబ్లెట్లను లాంచ్ చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా మెషిన్ లెర్నింగ్ సహాయంతో యూజర్ కు సజెషన్లు ఇవ్వగలుగుతుంది అర్బో వర్చువల్ అసిస్టెంట్. వినియోగదారుడి ప్రవర్తన, అలవాట్లు ఆధారంగా అది యాప్స్ వినియోగం నుంచి అనేక అంశాల వరకు ప్రొఫైల్ బేస్డ్ సజెషన్స్ ఇస్తుంది. ఇంతకుముందు పెయిర్ చేసిన బ్లూటూత్ డివైస్ ల సమీపంలో ఉన్నా కూడా గుర్తించి ఆ విషయం చెబుతుంది. ఇలా చాలా విషయంతో ముందస్తు హెచ్చరికలు, సూచనలు చేయడం ఈ అర్బో ప్రత్యేకత. భవిష్యత్తులో రిలీజ్ చేయబోయే ఫోన్లలో ఈ అర్బో టెక్నాలజీతో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామంటోంది పానసోనిక్.
ఎలుగ ఎక్స్ రే మాక్స్ ప్రత్యేకతలు
* 5.20 అంగుళాల డిస్‌ప్లే
* 1.4గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్
* 1080x1920 రిజల్యూషన్
* 16 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
* 4 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్
* 3000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
ఎలుగా రే ఎక్స్ ప్రత్యేకతలు
* 5.50 అంగుళాల డిస్‌ప్లే
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 6.0,
* 720x1280 రిజల్యూషన్
* 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, * 5ఎంపీ ఫ్రంట్ కెమెరా
* 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్
* 4000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
"