ఇండియన్ టెలికాం మార్కెట్లో ప్రయివేటు ఆపరేటర్ల పోటీని తట్టుకుని నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్సెన్నెల్ రంజాన్ సందర్భంగా కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ. 786, రూ.599 ప్లాన్లు తీసుకొచ్చింది.
రూ.786 కాంబో వోచర్లో 90 రోజులకు రోజుకు 3జీబీడాటా.... వాయిస్ కాల్స్ ఉంటాయి. రూ.599వోచర్లో 30 రోజుల వ్యాలిడిటీతో రూ.507 మెయిన్ బ్యాలన్స్, రూ.279 డెడికేటెడ్ బ్యాలన్స్ వస్తాయి. ఈ రెండు రకాల వోచర్లు జూన్ 30 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
వీటితో పాటు బీఎస్పెన్నెల్ పలు ఫుల్ టాక్ టైం, ఎక్సట్రా టాక్ టైం ఆఫర్లు కూడా అందిస్తోంది. రూ.60, రూ.110, రూ.210, రూ.290 రీచార్జులపై ఇవి వర్తిస్తున్నాయి. ఇవన్నీ ప్రీపెయిడ్ జీఎస్ ఎం యూజర్లకు వర్తిస్తాయి.