భారత్‌లో ఎక్కువమంది కొనే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో స్మార్ట్‌టీవీలు కూడా ఒకటి. షియోమి, శాంసంగ్, ఎల్‌జీ, వన్‌ప్లస్, టీసీఎల్ లాంటి కంపెనీల నుంచి ఎన్నో రకాల స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. వినియోగదారులకు అవసరాలకు తగ్గట్టుగా, అధునాతన సదుపాయాలతో ఈ కొత్త టీవీలు వస్తున్నాయి. మరి ఈ ఏడాది ఇలా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ టీవీల్లో ఉత్తమమైన టీవీలు ఏమిటో చూద్దామా...!
షియోమి ఎంఐ టీవీ 4ఎక్స్ 50
ఈ ఏడాది ఎక్కువమంది కస్టమర్లను ఆకట్టుకున్న స్మార్ట్ టీవీల్లో ముందు వరుసలో ఉండే టీవీ షియోమి ఎంఐ 4ఎక్స్ 50. భారత్‌లో తొలి టీవీని విడుదల చేసిన నాటి నుంచి షియోమి తన సేల్స్‌ను క్రమ క్రమంగా పెంచుకుంటుందే తప్ప తగ్గలేదు. ఎంఐ 4ఎక్స్ 50 టీవీని రూ.29,999 ధరకు విడుదల చేసిన షియోమి.. కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది. 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లే, 10 బిట్ డిస్‌ప్లే, 20 వాట్స్ స్పీకర్, పాచ్‌వాల్ 2.0 విత్ 4కే కంటెంట్ లాంటి స్సెసిఫికేషన్లతో ఇది అద్భుతంగా రూపొందింది. ఇందులో ఇంకో ముఖ్య ఫీచర్ ఏంటంటే ఇది ఆండ్రాయిడ్ ద్వారా గూగుల్ అసిస్టెంట్‌ని కూడా అనేబుల్ చేస్తుంది.
వన్ ప్లస్ టీవీ క్యూ1 సిరీస్
వన్‌ప్లస్ నుంచి వచ్చిన మరో మంచి టీవీఇది. ఈ కంపెనీ నుంచి రెండు టీవీలు మార్కెట్లోకి రాగా క్యూ1 సిరీస్ బాగా పేరు సంపాదించింది. ఇది ప్రిమియం టీవీ. దీని ధర రూ.69,900. దీని స్పెసిఫికేషన్లు కూడా రిచ్‌గానే ఉన్నాయి. 55 అంగుళాల డిస్‌ప్లే, 50 వాట్స్ సౌండ్ ఔట్‌పుట్, అయితే ఈ సిరీస్‌లోనే వచ్చిన క్యూ1 ప్రొ టీవీలో మాత్రం 8 స్పీకర్ సెటప్ ఉంది. ఆక్సిజన్ ప్లే లాంటి బెటర్ కనెక్టివిటీ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
సోని ఏ9జీ
బెస్ట్ డిస్‌ప్లే టీవీల్లో సోని ఏ9జీ ఒకటి. సోనిలో వచ్చిన టీవీల్లోకెల్లా దీన్ని ఉత్తమమైందని చెప్పొచ్చు ఏ9జీ ఓఎల్ఈడీ డిస్‌ప్లే మాస్టర్ సిరీస్ దీనిలో వాడారు. 55 అంగుళాల ఈ మోడల్ టీవీ ధర చాలా ఎక్కువ. దీన్ని రూ.299900కు అమ్ముతోంది ఈ జపాన్ కంపెనీ. 65 అంగుళాల మోడల్ ధర రూ.419900గా ఉంది. సోని ఏ9జీ మోడల్‌లో 4కే ఓఎల్ఈడీ డిస్ ప్లే దీనిలో వాడారు. ఎక్స్ 1 అల్టిమేట్ ఇంజన్, ఆటోమెటిక్ సర్ఫేస్ ఆడయో, డోల్బే విజన్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఇవి కూడా ఉత్తమమైనవే
శాంసంగ్ క్యూఎల్ఈడీ 8కే 2019
ఎల్‌జీ నానో సెల్ ఏఐ థింగ్
టీసీఎల్ పీ8ఎం 4కే ఏఐ టీవీ
వుయు ఆల్ట్రా ఆండ్రాయిడ్ టీవీ
థాంప్సన్ 55 అంగుళాల 4కే ఆండ్రాయిడ్ టీవీ
మైక్రోమాక్స్ స్మార్ట్ టీవీ
మార్‌క్యూ 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ టీవీ