ప్రస్తుత మొబైల్ యుగంలో ప్రతి ఒక్కరు విరివిగా స్మార్ట్ ఫోన్ లు వాడుతున్నారు. ప్రతి ఒక్కరి సమస్యా ఫోన్ చార్జింగ్ గురించే... నిజానికి కొన్ని రకాల చార్జర్లు చాల తొందరగా ఛార్జ్ అవ్వడంతో పాటు... ఎక్కువ సమయం ఛార్జింగ్ కూడా ఇస్తాయి. ఫోన్ తో పాటు వచ్చిన ఛార్జ్ పనిచేయనప్పుడు మార్కెట్ లో ఏది తక్కువ ధరకు దొరికితే వాటిని కొనడం పరిపాటిగా మారింది. ఛార్జ్ అవుతోంది కదా ఏది అయితే ఏమి అనుకుంటారు చాలా మంది... కాని అక్కడే పొరపాటు జరుగుతున్నట్లు లెక్క. తక్కువ ధరకు దొరికే చార్జర్లు చాల తొందరగానే ఫోన్ ఛార్జ్ అయినా కాని.. అంతే తొందరగా అయిపోతుంది. దీనికి కారణం అనేక రకాలు ఉన్నా... వాటితో విసిగి పోయిన వారు కంపెనీ చార్జర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. నిజానికి అన్ లైన్ సైట్స్ లో కంపెనీ నేమ్ చూపిస్తున్నా చాల వరకు నకిలీవే దొరుకుతున్నాయి. వాటిని కొన్న వారు ఫోన్ ఛార్జ్ తొందరగా కాకపోగా విసిగేత్తిసుంటాయి. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి మార్కెట్ లో బెస్ట్ ఛార్జర్స్ ని మీకు అందిస్తున్నాము. ఇవి చాలా తొందరగా ఛార్జ్ అవ్వడంతో పాటు మన్నిక కూడా బాగానే వస్తాయి. కాకపోతే ధర ఎక్కువగానే ఉంటుంది. 2) నోకియా కంపెనీ నుంచి Nokia AC-60 Universal Fast USB Charger మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే కేవలం 30 నిమిషాల్లో మీ ఫోన్ ఛార్జింగ్ ని దాదాపు 70 శాతం వరకు పూర్తి చేస్తుంది. దీని ధర 849 రూపాయలు, బరువు 109 గ్రాములు, అంతే కాకుండా 6 నెలలు వారంటీ కూడా లభిస్తుంది. 3) ఇక మార్కెట్ లో చాలా బెస్ట్ క్వాలిటీతో ఉన్న చార్జర్ Aukey Quick Charge 2.0 18W USB Charger దీని ధర 2199 రూపాయలు.. కాస్తా ఎక్కువగానే ధర ఉన్నా చాలా మంచి ఫ్యూచర్ లు ఇందులో ఉన్నాయి. లైట్ వెయిట్ ఉన్న ఇది అమెరికా నుంచి ఇది ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఓవర్ చార్జింగ్ అలాగే ఓవర్ హీటింగ్ సమస్యలు ఇందులో ఉండవు. మన్నిక కూడా చాలా ఎక్కువ కాలం వస్తుంది. 4)శ్యాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన బెస్ట్ క్వాలిటీలో Sumsung Travel Adapter 2A Fast Charger ఒకటి. దీని ధర 1239 రూపాయలుగా ఉంది. బరువు 50 గ్రాములు. కాకపోతే కేవలం నెలరోజులు వారంటీ మాత్రమే ఉంది. 5) నోకియా నుంచి తక్కువ ధరలో లభిస్తున్న చార్జర్ Nokia AC-20 N Micro USB Charger 100 గ్రాములు బరువు ఉంటుంది. దీని ధర 440 రూపాయలు. నోకియా నుంచి వచ్చిన మరో అద్భుతమైన చార్జర్ కాకపోయినా తక్కువ ధరలో లభిస్తున్న వాటిలో కాస్తా బెస్ట్ అని చెప్పవచ్చు. 6 నెలల వారంటీతో లభిస్తోంది. చార్జర్ కాస్తా నెమ్మదిగానే అవుతుంది. |