• తాజా వార్తలు

ఎక్కువ బ్యాట‌రీ లైఫ్‌తో ఉన్న బెస్ట్ బ‌డ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవీ..

స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల అభిరుచులు రోజురోజుకూ మారిపోతున్నాయి.  కెమెరాలతోపాటు ఎక్కువ బ్యాట‌రీ బ్యాక‌ప్ ఉండే ఫోన్ల‌కు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఒక‌ప్పుడు 2,300 ఎంఏహెచ్ బ్యాట‌రీనే ఎంతో ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు అంత‌కు రెట్టింపు బ్యాట‌రీ సామ‌ర్థ్యం కూడా వినియోగ‌దారుల‌కు స‌రిపోవ‌డం లేదు.  అందుకే మెరుగైన ఫీచర్ల‌తో ఎక్కువ బ్యాట‌రీ సామ‌ర్థ్యం ఉంటే చాలు.. ఆ ఫోన్ హాట్‌కేకులా మారిపోతోంది. డ‌బ్బులు ఎక్కువైనా ఫ‌ర్లేదు బ్యాట‌రీ బ్యాక‌ప్‌కే మా ఓటు అనేస్తున్నారు. మ‌రి ఎక్కువ బ్యాట‌రీ లైఫ్‌తో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏంటో చూసేద్దాం..
 

షియామీ రెడ్‌మీ నోట్ 5 ప్రో (Xiaomh i Redmi Note 5 Pro)
ప్ర‌స్తుతం డే టు డే యూసేజ్ కోసం వినియోగించే ఫోన్ల‌లో షియామీ స్మార్ట్‌ఫోన్లే అధికం. ఒక రోజు కంటే ఎక్కువ‌గా బ్యాట‌రీ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం యూజ‌ర్ల‌లో బ‌లంగా ఉంది. ఆ  న‌మ్మ‌కానికి త‌గ్గ‌ట్టుగానే బెట‌ర్ బిల్డ్ క్వాలిటీతో మెరుగైన కెమెరాతో షియామీ మోడ‌ళ్లు దేశీయ మార్కెట్‌లో అడుగు పెడుతున్నాయి. ఇందులో రెడ్ మీ నోట్ 5 ప్రో మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది. 5.99 అంగుళాల డిస్‌ప్లే గ‌ల ఈ ఫోన్‌.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 636 ఆక్టా-కోర్ ప్రోసెస‌ర్ మీద ప‌నిచేస్తుంది. ఇందులో బ్యాక్ 12+5 మెగా పిక్స‌ల్‌ డ్యుయెల్ కెమెరాల‌తో పాటు ఫ్రంట్ 20 మెగా పిక్స‌ల్స్ కెమెరాతో పాటు ఎల్ఈడీ ప్లాష్ ఉంది.  4వేల ఎంఏహెచ్ బ్యాట‌రీ గ‌ల ఈ ఫోన్ 4జీబీ మోడ‌ల్ 14,999. ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్‌ను స‌పోర్ట్ చేయ‌క‌పోయినా.. బ్యాట‌రీ మెరుగ్గా ప‌నిచేస్తుంది. 

 ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 (Asus Zenfone Max Pro M1)
 భారీ ఫోన్ల‌కు మారుపేరైన ఆసుస్ నుంచి భారీ బ్యాక‌ప్‌తో వ‌చ్చింది జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1. 5వేల ఎంఏహెచ్ బ్యాట‌రీ గ‌ల ఈ ఫోన్ ధ‌ర రూ.15వేల లోపు ఉంది. ఒక్క‌సారి ఛార్జింగ్ ఫుల్‌గా పెడితే సుమారు 19 గంట‌ల పాటు నిరంత‌రాయంగా ఫోన్‌ వినియోగించ‌వ‌చ్చు. ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేయ‌క‌పోయినా.. మూడు గంట‌ల్లోనే బ్యాట‌రీ 100 శాతం ఛార్జి అవుతుంద‌ని కంపెనీ చెబుతోంది. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజి ఉన్న ఫోన్ ధ‌ర రూ.10,999. 4జీబీ/  64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.12,999 

లెనోవో కే8 నోట్ (Lenovo K8 Note)
5.5 అంగుళాల స్క్రీన్ గ‌ల ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో ఎక్స్‌23 ప్రాసెస‌ర్ మీద ప‌నిచేస్తుంది. ఇందులో 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది. ఒకసారి చార్జింగ్ పెడితే సుమారు రోజు.. అంత‌కంటే ఎక్కువగానే బ్యాట‌రీ లైఫ్ ఉంటుంద‌ట‌. ఇందులో 13ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండ‌టంతో అంద‌మైన సెల్ఫీలు కూడా తీసుకోవ‌చ్చు. 3జీబీ, 32 జీబీ  మొబైల్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా, 4జీబీ, 64 జీబీ వేరియంట్  ధ‌ర రూ.13,999గా ఉంది. 


 మోటో జీ6 ప్లే (Moto G6 Play)
 
మోటో మొబైల్స్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం త‌క్కువ‌గా ఉన్నా.. ఎక్కువ స‌మ‌యం బ్యాకప్ వస్తాయి. ప్ర‌స్తుతం మోటో మొబైల్స్ ఎక్కువ బ్యాట‌రీ సామ‌ర్థ్యం గ‌ల ఫోన్ మోటో జీ6 ప్లే. ఫాస్ట్ చార్జింగ్ తో వ‌స్తున్న ఈ ఫోన్ 4000 ఎంఏహెచ్  భారీ బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగ‌న్ 430 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌తో వ‌స్తుంది. ఎంత భారీగా వినియోగించినా రోజంతా బ్యాట‌రీ బ్యాక‌ప్ ఉంటుంది. 13 ఎంపీ బ్యాక్‌,  ఫ్రంట్ 8 మెగాపిక్స‌ల్ కెమెరాలున్న 3జీబీ, 32 జీబీ వేరియంట్ ధ‌ర రూ.11,999. 

నోకియా 2 (Nokia 2)
స్మార్ట్‌ఫోన్ల త‌యారీలో ఆల‌స్యంగా అడుగు పెట్టిన నోకియా కూడా భారీ బ్యాట‌రీ సామ‌ర్థ్యం గ‌ల ఫోన్ల‌ను త‌యారు చేస్తోంది. ప్రస్తుతం నోకియా 2  స్మార్ట్‌ఫోన్ 4,100 ఎంఏహెచ్‌తో వ‌స్తోంది. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల వ‌ర‌కూ బ్యాక‌ప్ వ‌స్తుంద‌ని కంపెనీ చెబుతోంది.  ఐదు అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే గ‌ల ఈ ఫోన్ స్నాప్‌డ్రాగ‌న్ 212 ప్రాసెస‌ర్‌పై ప‌నిచేస్తుంది. కేవ‌లం 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమొరీగ‌ల ఈ ఫోన్ ధ‌ర రూ.6,999. కెమెరా విష‌యంలో మాత్రం నిరుత్సాహ‌ప‌డ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే బ్యాక్ 8 ఎంపీ, ఫ్రంట్ 5 ఎంపీ కెమెరా మాత్ర‌మే ల‌భిస్తుంది. 

మోటో ఈ4 ప్ల‌స్ (Moto E4 Plus)
మోటో మొబైల్స్ అన్నింటిలోకెల్లా భారీ బ్యాట‌ర్ గ‌ల ఫోన్ మోటో ఈ4 ప్ల‌స్‌. దాదాపు 5వేల ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.9,999. ఫాస్ట్ చార్జింగ్ స‌దుపాయం కూడా ఉన్న ఈ మొబైల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. దాదాపు 2 రెండు రోజుల వ‌ర‌కూ మ‌ళ్లీ చార్జింగ్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉండ‌దుట‌. 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే గ‌ల ఈ ఫోన్ స్నాప్‌డ్రాగ‌న్ 427 ప్రాసెస‌ర్ మీద ప‌నిచేస్తుంది. బ్యాక్ 13 మెగా పిక్స‌ల్‌, ఫ్రంట్ 5 మెగా పిక్స‌ల్ కెమెరాలు ఉన్న ఈ మొబైల్‌.. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో ల‌భిస్తోంది. 
 

జన రంజకమైన వార్తలు