• తాజా వార్తలు

బడ్జెట్ రేంజిలోనే బెస్ట్ ఫీచర్స్

మన జేబు ఎంతవరకు పర్మిట్ చేస్తుందో రేంజిలోనే ఫోన్ దొరికితే హ్యాపీగా ఫీలవుతాం. కొన్ని సంస్థలు సరిగ్గా అలాంటివారికే స్మార్టు ఫోన్లను తయారుచేస్తున్నాయి.   బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలోహానర్ 4ఎక్స్' విపరీతమైన ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. దీని రూపకర్త అయిన ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ హువావీ తాజాగాహానర్ 4సీ' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసి వార్తల్లో నిలిచింది. తక్కువ ధర సెగ్మెంట్‌లో యాక్షన్ ప్యాకెడ్ ఫీచర్లతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన ఫోన్ మార్కెట్లో సూపర్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్ రూపకల్పనలో భాగంగా తన సాంప్రదాయ సాలిడ్ నిర్మాణ శైలిని హువావీ మరోసారి కంటిన్యూ చేసింది.  దీని 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే వల్ల పేరుకు ఇది బడ్జెట్ ఫోన్ అయినా హెవీ లుక్ వచ్చేసింది. దీని రిజల్యూషన్ సామర్థ్యం 1,280 x 720పిక్సల్స్. డిస్‌ప్లే ద్వారా వీడియోలను, ఫోటోలను అత్యుత్తమ క్వాలిటీతో వీక్షించవచ్చు. హానర్ 4సీ లో శక్తివంతమైన 1.2గిగాహెర్ట్జ్  కైరిన్ 620 ఆక్టాకోర్ 64 బిట్ ప్రాసెసర్‌ ఉపయోగిస్తున్నారు.

మల్టీ టాస్కింగ్ కోసం వేగవంతమైన ర్యామ్ హానర్ 4సీ స్మార్ట్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన 2జీబి ర్యామ్ ఫోన్ మల్టీ టాస్కింగ్‌ను మరింత మెరుగుపరుస్తుంది. ఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్ హువావీ హానర్ 4సీలో పొందుపరిచినఎమోషన్ 3.0 యూజర్ ఇంటర్‌ఫేస్' ద్వారా ఫోను మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఆపరేట్ చేసుకోవచ్చు. శక్తివంతమైన ప్రధాన కెమెరా హువావీ హానర్ 4సీ శక్తివంతమైన 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. కెమెరా ద్వారా మన్నికైన చిత్రాలను క్యాప్చర్ చేసుకోవచ్చు. మొత్తానికి బడ్జెట్ రేంజిల్ హైఎండ్ ఫీచర్లతో ఇది అద్భుతంగా అనిపిస్తోంది.

 

జన రంజకమైన వార్తలు