నేడు స్మార్ట్ ఫోన్ ను కలిగిఉండడం ఎంత ముఖ్యమో వాటికి అందమైన కేసులను కలిగిఉండడం కూడా అంతే ముఖ్యం మరియు అంతే ఫ్యాషన్ అయ్యింది. అనేక రకాల ఫ్యాషన్ లలో అందమైన మొబైల్ కేసులను కలిగిఉండడం కూడా ఒక ఫ్యాషన్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్ లో అనేక రకాల డిజైన్ ల స్మార్ట్ ఫోన్ కేసులు లభిస్తున్నాయి. రోడ్ ల పక్కన ఉండే చిన్న చిన్న షాప్ ల దగ్గరనుండీ పెద్ద షాపింగ్ మాల్ లవరకూ అన్నింటిలోనూ ఇవి లభిస్తున్నాయి. అవి లభించే చోటు ను బట్టి వీటి ధర ఉంటుంది. అయితే మన ఫోన్ యొక్క కేసు ను మనమే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? అవును మన ఇంట్లో లభించే వస్తువులతో స్మార్ట్ ఫోన్ యొక్క కేసు లు మనమే తయారు చేసుకుంటే అదికూడా అత్యంత అందంగా ఉంటే ఆ అనుభూతే చాలా బాగుంటుంది కదా! అలాంటి హోం మేడ్ స్మార్ట్ ఫోన్ కేసు ల గురించి ఈ ఆర్టికల్ లో చదువుకుందాం. మీ పాత ఫోన్ కేసును గోళ్ళ రంగుతో అందంగా తయారు చేయండి. అవును. మనం ఇంట్లో వాడే గోళ్ళ రంగు తో మన ఫోన్ యొక్క కేస్ ను అందంగా చేయవచ్చు. ఒక పాత కేసు ని తీసుకోండి. అది స్పష్టం గా ఉండేట్లు చూడండి. దానిని ఏదైనా ఒక ముదురు రంగు తో పెయింట్ చేయండి. ఆ తర్వాత దానిపై మరొక రంగు పెయింట్ వెయ్యండి. దానిపై జిలుగు జిలుగు మనే మరొక గోళ్ళ రంగు ను పెయింట్ వెయ్యండి. ఇలా అనేక రంగులను ఒక డిజైన్ మాదిరిగా దానిపై పెయింట్ వెయ్యండి. కొద్ది సేపటి తర్వాత చూడండి. మీ అందమైన స్మార్ట్ ఫోన్ కేస్ రెడీ. కొత్త లుక్ కోసం మెరుపులు అంటించండి. ఒక క్లియర్ ఫోన్ కేస్ ను కొనండి. దానిపై వైట్ గ్లూ ను పూసి ఆ గ్లూ పై మెరుపులు అంటించండి. అది ఆరిపోయిన తర్వాత ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా మీ ఫోన్ కేస్ ను మెరుపుల తో అందంగా చేసుకోవచ్చు. మ్యాగజైన్ ప్రియుల కోసం మీకు మ్యాగజైన్ లు అంటే చాలా ఇష్టమా? మీకు ఇష్టమైన మ్యాగజైన్ యొక్క లోగో ను మీ ఫోన్ పై ఉండాలి అనుకుంటున్నారా? అయితే అది మీ చేతుల్లోనే ఉంది. మీకు నచ్చిన మ్యాగజైన్ యొక్క ఇమేజ్ ను చక్కగా కట్ చేయండి. దానివెనుక గ్లూ పూయండి. దీనిని ఇప్పుడు నీట్ గా మీ స్మార్ట్ ఫోన్ యొక్క కేస్ పై అతికించండి. మీ ఫేవరెట్ మ్యాగజైన్ యొక్క ఇమేజ్ మీ ఫోన్ పై రెడీ.ఇలా అనేక రకాల మాగజైన్ ల ఇమేజ్ లేదా లోగో లను కూడా మీ ఫోన్ కేస్ లపై అంటించవచ్చు. tape it out వివిధ రకాల టేప్ లను ఉపయోగించి మీ కేస్ లను అందంగా తయారుచేయాలి అనుకుంటున్నారా? దీనికి మీ దగ్గర వివిధ రకాల గ్లిట్టర్ టేప్ లు ఉంటె చాలు. ఇలాంటి టేప్ లను వివిధ రంగుల లో ఫాన్సీ షాప్ లలో కొనుగోలు చేయవచ్చు. లేదా కిడ్స్ స్టేషనరీ షాప్ లలో నూ లభిస్తాయి. వీటిని మీ కేస్ పై అడ్డంగా, నిలువుగా , మూలగా ఎలా పడితే అలా అంటించవచ్చు. ఆ తర్వాత అవసరమైతే చిన్న చిన్న స్టోన్ లను కూడా అంటించవచ్చు. ఇక మీ టేప్ కేస్ రెడీ. ఫ్లోరల్ ప్రింట్స్ క్లాత్ ల పై ఉండే వివిధ రకాల పూల డిజైన్ లను కట్ చేయండి. వీటిని గ్లూ సహయంతో మీ ఫోన్ పై అక్కడక్కడా అంటించండి. ఆ పూల యొక్క డిజైన్ లలోని కొన్ని భాగాలను మీ ఫోన్ యొక్క కెమెరా చుట్టూ అందంగా అంటించండి.మీ అందమైన ఫోన్ కేస్ రెడీ. సులభమైన కేస్ పౌచ్ ఇది చాలా సులభమైన ఫోన్ కేస్. మీ ఇంట్లో ఉన్న అందమైన వస్త్రం ను నీట్ గా కట్ చేసి దీనిని సూది మరియు దారం సహాయం తో ఒక పౌచ్ మాదిరిగా కుట్టాలి. దీనికి బటన్ మరియు రిబ్బన్ లను కూడా కుట్టాలి. బటన్ కోసం ఒక రంద్రాన్ని చేయండి. మీ అందమైన ఫోన్ కేస్ రెడీ. టాటూ పౌచ్ ఇది అన్నింటి కంటే సులభమైనది. మీ ఫోన్ యొక్క కేస్ పై టాటూ లను కానీ స్మైలీ స్టిక్కర్ లను కానీ అంటించండి. అంతే మీ స్మార్ట్ ఫోన్ కేస్ రెడీ. |