• తాజా వార్తలు

చైనా వద్దట.. రెడ్ మీ ముద్దట

చైనా వస్తువులు వద్దంటూ సోషల్ మీడియా వేదికగా కోట్లాది మంది భారతీయుల పోస్టింగులు, కామెంట్లు ఓ వైపు.. ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో సేల్ కు పెట్టగానే అర నిమిషంలో లక్షలాది చైనా ఫోన్లు అమ్ముడైపోతుండడం మరోవైపు. విచిత్రంగా ఉన్నా మొబైల్ మార్కెట్లో చైనా డామినేషన్ ను కేవలం టెక్నాలజీతోనే తప్ప అనవసర ప్రచారాలు, సూడో స్వదేశీ భావనలతోనూ అడ్డుకోలేమనడానికి ఇది ఉదాహరణ. యథావిధిగా బుధవారం(18.01.17) కూడా ఫ్లిప్ కార్టులో చైనా మొబైల్ సంస్థ షియోమీ సూపర్ హిట్ మోడళ్లు ‘రెడ్ మీ 3ఎస్’, ‘రెడ్ మీ 3 ఎస్ ప్రైమ్’లు అమ్మకానికి పెట్టిన సెకన్లలోనే అవుటాఫ్ స్టాకయ్యాయి. ప్రతి బుధవారం జరుగుతున్న తంతే ఇది. ఇది చాలు రెడ్ మీ వంటి సూపర్ హిట్ చైనా మొబైళ్లకు ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి. అవే ఫీచర్లున్న ఇతర సంస్థల ఫోన్ల ధరలు భారీగా ఉండడం.. పైగా పెర్మార్మెన్సులో వీటి కన్నా వెనుకంజలో ఉండడంతో వినియోగదారులు రెడీ మీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ మీ మరో కొత్త మోడల్ ను విక్రయించడానికి రెడీ అయిపోయింది. ఇండియన్ మార్కెట్లో గురువారం (19.01.17)న ఇది అందుబాటులోకి రానుంది. దీని ధర ఇంతవరకు ప్రకటించకపోయినా కూడా జనం దీనికోసం వెయిట్ చేస్తున్నారు.

షియోమీ రెడ్ మీ నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ ను గురువారం న్యూఢిల్లీలో జరిగే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించబోతున్నారు.  2016లో వచ్చిన రెడ్మీ నోట్‌ 3 ఫోన్‌ వినియోగదారుల నుంచి భారీ ఆదరణ సొంతం చేసుకోవడంతో  విజయవంతమైన ఆ ఫోన్‌కు తాజా వెర్షన్‌గా రెడ్మీ నోట్‌ 4ను షియోమీ రంగంలోకి దింపుతోంది. ఫ్లిప్ కార్టులో దీనికి సంబంధించి ప్రోమో వేస్తున్నా డీటెయిల్స్ మాత్రం వెల్లడి చేయడం లేదు.

క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ప్రాసెసర్‌తో రాబోతోన్న ఈ ఫోన్‌ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని సమాచారం.

మొదటి వేరియంట్‌: 2జీబి ర్యామ్‌ +32జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌
రెండో వేరియంట్‌: 3జీబి ర్యావ్‌ +32జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌
మూడవ వేరియంట్‌: 4జీబి ర్యామ్‌ +64జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌ గా ఉంటుందని భావిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్ అమ్మకాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.

దీని ఇతర స్పెసిఫికేషన్లు..

  • 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
  • 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • డెకా కోర్ ప్రాసెసర్, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
  • 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
  • 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
  • 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

జన రంజకమైన వార్తలు