• తాజా వార్తలు

చైనా యాపిల్ ఫోన్‌గా మొబైల్ ఫోన్ మార్కెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన రెడ్‌మీ (షియోమి)కి డౌన్‌ఫాల్ స్టా

2016లో ఇండియ‌న్ మార్కెట్‌లో  100 కోట్ల  రెవెన్యూ సాధించిన రెడ్‌మీ చైనాలో మాత్రం  రేస్‌లో వెన‌క‌బ‌డిపోయిందా?
 అవునంటున్నాయి టెక్నాల‌జీ మార్కెట్ వ‌ర్గాలు.  రెడ్‌మీ  స్మార్ట్ ఫోన్ సేల్స్ 22 శాతం త‌గ్గి విక్ర‌యాల్లో  నాలుగో స్థానానికి ప‌డిపోయింది.  ప్రపంచ‌వ్యాప్తంగా చూస్తే విక్ర‌యాల్లో ఏడో స్థానానికి ప‌డిపోయింద‌ని తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి.
 ఒక్క‌సారిగా ఎందుకిలా?
 స్మార్ట్‌ఫోన్ విక్ర‌యాల్లో దుమ్ము రేపిన రెడ్‌మీ ఇప్పుడు స‌డెన్‌గా ఎందుకిలా వెన‌క‌బ‌డిపోయింది అంటే చాలా కార‌ణాలే క‌నిపిస్తున్నాయి. ఫోన్ క్వాలిటీ, ప‌ర్‌ఫార్మెన్స్‌ప‌రంగా లాప్సెస్ కంటే సంస్థాగ‌తంగా రెడ్‌మీ  చేసుకున్న సొంత పొర‌పాట్లే ప్ర‌స్తుత ప‌రిస్థితికి కార‌ణ‌మ‌ని మార్కెట్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.
 అదే కొంప ముంచింది..
 రెడ్‌మీకి పుట్టినిల్ల‌యిన చైనా జ‌నాభా ప‌రంగా ప్ర‌పంచంలోనే అతిపెద్ద దేశం. అక్క‌డ ఎగువ మ‌ధ్య‌తర‌గ‌తి వ‌ర్గం బాగా పెరుగుతుండ‌డంతో కొనుగోలు శ‌క్తి కూడా వారితో పాటే పెరుగుతోంది. దీనికి త‌గ్గ‌ట్లు కొత్త కొత్త మోడ‌ల్స్‌ను, స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో తీసుకువ‌చ్చిన కంపెనీల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఈ విష‌యంలో రెడ్‌మీ వెన‌కబ‌డింది. గ‌డిచిన ఐదారు నెల‌ల్లో రెడ్‌మీ నుంచి మెరుపులాంటి మోడ‌ల్సేమీ రాలేదు. అదే టైంలో ఒప్పో, వివోలాంటి కంపెనీలు కొత్త కొత్త మోడ‌ల్స్‌, ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌ను ముంచేశాయి.  స్మార్ట్‌ఫోన్‌కు గుండెకాయ‌లాంటి రామ్‌, కెమెరా క్వాలిటీ వంటి వాటిలో అవి చ‌క‌చ‌కా అడుగులేశాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఒప్పో ఎఫ్ 1 ఎక్స్ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ రామ్‌తో మొబైల్ ప్రియుల‌ను ఆక‌ట్టుకుంది. ఇక  దీనికి ఉన్న 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ప్రియుల‌ను పిచ్చెక్కిస్తోంది. కేవ‌లం ర్యామ్‌, కెమెరాతో ఒప్పో మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. వివో కూడా మూన్‌లైట్ సెల్ఫీ అంటూ కొత్త ఫీచ‌ర్ల‌తో రంగంలోకి దిగింది.  ఎంఐ గొప్ప‌గా ప్ర‌క‌టించుకున్న మాక్స్ స‌హా ఏ మోడ‌ళ్లూ ఈ ఫీచ‌ర్ల విష‌యంలో వీటికి ఎదురు నిల‌వ‌లేక‌పోయాయి.  రెడ్‌మీ 10, 12 వేల రూపాయ‌ల కేట‌గిరీలోనే త‌క్కువ ఫీచ‌ర్ల‌తో ఫోన్లు రిలీజ్ చేస్తుండ‌గా 18 నుంచి 25వేల వ‌ర‌కు ధ‌ర‌తో ఒప్పో, వివో వంటివి మ‌రింత మెరుగైన ఫీచ‌ర్ల‌తో ముందుకొచ్చాయి. ధ‌ర ఎక్కువైనా ఫీచ‌ర్లు బాగున్నాయన్న ఉద్దేశంతో అర్బ‌న్ మిడిల్ క్లాస్ వీటిని ఆద‌రిస్తూ రెడ్ మీని నెమ్మ‌దిగా ప‌క్క‌న పెట్టేస్తోంది.
ఇండియాలో ముందుకు.. చైనాలో వెన‌క్కి..
 2016 వ‌ర‌కు చైనాలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రెడ్‌మీ వాటా 30%.  అది కూడా ఆన్‌లైన్ అమ్మ‌కాలే. మిగిలిన 70 శాతం మార్కెట్‌ను ఆఫ్‌లైన్ అమ్మ‌కాల‌తో కాప్చ‌ర్ చేయ‌కుండా వ‌దిలేసింది. దాన్ని మిగతా కంపెనీలు అందిపుచ్చుకున్నాయి. ఆఖ‌రికి యాపిల్ లాంటి కాస్ట్లీ ఫోన్లు కూడా చైనాలో రెడ్‌మీని దాటేసే ప‌రిస్థితి.  2016లో 4.49 కోట్ల ఐఫోన్ల‌ను యాపిల్ చైనాకు ఎగుమ‌తి  చేస్తే రెడ్‌మీ 4.15 కోట్ల ఫోన్‌లో చేయ‌గ‌లిగింద‌ని  ఇంట‌ర్నేష‌నల్ డాటా కార్పొరేష‌న్ అనే మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇటీవ‌లే ప్ర‌క‌టించింది.  అయితే గ‌త ఏడాది ఇండియాలో మాత్రం రెడ్‌మీ బాగానే ప‌ట్టు నిల‌బెట్టుకుంది.  2016లో దాదాపు 100 కోట్ల రెవెన్యూ ఇండియాలో సంపాదించుకుంది. స్ట్రాంగ్ మేనేజ్ మెంట్ టీం ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని  ఐడీసీసౌత్ ఏసియా ఎండీ జైదీప్ మెహ‌తా చెప్పారు.
 ఆన్‌లైన్‌నే న‌మ్ముకుని..
 రెడ్‌మీ తొలి నాటి నుంచి ఆన్‌లైన్ సేల్స్‌పైనే దృష్టి పెట్టింది. ఆఫ్‌లైన్‌లో అంటే బ‌య‌టి షాపుల్లో ఇవి దొరికేవి కావు. తర్వాత ప‌రిస్థితి కొంత మారినా ఇప్ప‌టికీ చాలా మోడ‌ళ్లు ఆఫ్‌లైన్‌లో దొర‌క‌వు. అదే ఒప్పో, వివో త‌దిత‌ర ఫోన్లు దుకాణాల్లో నే ఎక్కువ అమ్ముడ‌వుతున్నాయి. దానికి త‌గ్గ‌ట్టుగానే ఒప్పో, వివో విప‌రీత‌మైన ప‌బ్లిసిటీ చేసుకుంటున్నాయి.  మూన్‌లైట్ సెల్ఫీ అంటూ  అలియాభ‌ట్ లాంటి బాలీవుడ్ సెల‌బ్రిటీ పబ్లిసిటీ వివోకు మంచి ఫేం తెచ్చింది. ఇలాంటి వాట‌న్నింటిలోనూ రెడ్‌మీ పూర్తిగా వెన‌క‌బడిపోయింది.
 మార్గ‌ద‌ర్శ‌కులేరి?
 రెడ్‌మీ ఇంట‌ర్నేష‌నల్ ఆప‌రేష‌న్స్ హై ప్రొఫైల్ హెడ్‌గా ప‌ని చేసిన హ్యూగో బర్రా జ‌నవ‌రిలో ఫేస్‌బుక్‌కు వెళ్లిపోయాడు. ఫేస్‌బుక్ వ‌ర్చువ‌ల్ రియాలిటీ ప్రాజెక్టును లీడ్ చేయ‌డానికి అత‌ణ్ని తీసుకుంది. ఇలాంటి కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే వ్యక్తి వెళ్లిపోయినా వాటిపై రెడ్‌మీ పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేద‌ని, మార్కెటింగ్ స్ట్రాట‌జీలు వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డానికి అది కూడా కార‌ణ‌మ‌ని మార్కెట్ ఎనాలిసిస్‌.  ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో స్పెయిన్‌లో జ‌రిగే మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్‌లో ప్ర‌ద‌ర్శించ‌డానికి రెడ్‌మీ ద‌గ్గ‌ర కొత్త మోడ‌ల్సే లేవ‌ని స‌మాచారం. ప్ర‌పంచ‌వ్యాప్త మొబైల్ కంపెనీల‌న్నీ త‌ర‌లివ‌చ్చే ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లో రెడ్‌మీ ఉత్త చేతుల‌తో నిల‌బడుతుంద‌న్న స‌మాచారం నిజ‌మైతే కంపెనీకి అత్య‌వ‌స‌రంగా మార్గ‌ద‌ర్శ‌కులు కావాల్సిందే.
  త‌క్ష‌ణం ఏం చేయాలి?
 * రెడ్‌మీ  త‌న ప్రొడ‌క్ట్స్‌లో 95 శాతాన్ని ఇండియా, చైనాల్లోనే అమ్ముతుంది. కాబ‌ట్టి ఇక్కడి మిడిల్‌, అప్ప‌ర్ మిడిల్ క్లాస్ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్లు ఙై ఫీచ‌ర్ల‌తో ప్రొడ‌క్ట్స్‌ను త‌యారుచేయాలి.  ఇందుకోసం ఆర్ అండ్ డీ విభాగాన్ని బాగా ప‌టిష్ట‌ప‌ర‌చాలి.
 * వివో, ఒప్పో వంటి కంపెనీల మార్కెటింగ్ వ్యూహాల‌నూ అల‌వ‌ర్చుకోవాలి.
 *  ముఖ్యంగా ఆఫ్‌లైన్‌లోనూ అన్ని ర‌కాల సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, యాక్సెస‌రీస్ అందుబాటులో ఉంచాలి. చిన్న ప‌ట్ట‌ణాల్లోనూ ఇవి అందుబాటులో ఉండ‌క‌పోతే రెడ్‌మీ మార్కెట్లో నిల‌దొక్కుకోవ‌డం మ‌రింత క‌ష్ట‌మ‌వుతుంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

జన రంజకమైన వార్తలు