• తాజా వార్తలు

అతి త్వరలో రానున్న అత్యుత్తమ 4 జి ఆండ్రాయిడ్ ఫోన్ లు మీకోసం

ప్రతీ రోజు టెక్నాలజీ అనేది అప్ డేట్ అవుతుంది అనేది మనం ఎప్పుడూ చర్చించుకునే విషయమే. ఇలా రోజురోజుకీ పెరుగుతున్న టెక్నాలజీ అనేది అత్యంత ఎక్కువ సామర్థ్యాన్ని చూపించడమే గాక దాని పరిధినీ మరియు విస్తృతినీ పెంచుకుంటుంది.భారత వినియోగదారుల సామర్థ్యం స్మార్ట్ ఫోన్ తయారీదారులకందరికీ తెలిసిపోయింది. స్మార్ట్ ఫోన్ తయారీ దారులు మరియు టెలికాం ఆపరేటర్ లు క్రమం తప్పకుండా తమ టెక్నాలజీ ని అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకర్షించే పనిలో చాలా బిజీ గా ఉన్నారు. కంపెనీలు తమ ఉత్పత్తులను తక్కువ ధర, మధ్య స్థాయి మరియు ఎక్కువ ధర ఇలా మూడు రకాలుగా వర్గీకరించి ఈ మూడు రకాల లోనూ దాదాపు అన్ని ఫీచర్ లతో కూడిన ఉత్పత్తులను అందిస్తున్నాయి.

టచ్ స్క్రీన్ ఫీచర్ లు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు, వైర్ లెస్ సింక్రనైజేషన్ మరియు కెమెరా లు లాంటి అధునాతన ఫీచర్ లతో మొబైల్ తయారీదారులు మొబైల్ ఫోన్ యొక్క నిర్వచనాన్నే మార్చి వేసి వేయాయి. ఇవి మాత్రమే గాక అనేక రకాల అధునాతన ఫీచర్ లు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లలో లభిస్తున్నాయి. ఇక రెండో విషయం డేటా కు సంబందించింది. 3 జి ని దాటి 4 జి ని కూడా సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ లు ప్రస్తుతం లభిస్తున్నాయి. ప్రస్తుతం రాబోతున్న స్మార్ట్ ఫోన్ లన్నీ దాదాపుగా అన్నీ 4 జి నెట్ వర్క్ యాక్సెస్ ను కలిగి ఉంటున్నాయి. ఈ నేపథ్యం లో అతి త్వరలో రానున్న 4 జి కనెక్టివిటీ తో కూడిన బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాం.

 

1.       జియోమీ రెడ్ మి నోట్ 4

ఈ స్మార్ట్ ఫోన్ జనవరి మొదటి వారం లో విడుదల కానుంది. ఇది రెండు వేరియంట్ లలో లభిస్తుంది. ఒకటి 16 GB మరియు 64 GB లలో లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,100 mAh బాటరీ, 13 MP కెమెరా, 3GB/4GB RAM  లతో ఇది లభిస్తుంది. ఇందులో డ్యూయల్ సిమ్ స్లాట్ ల తో పాటు 4 జి కనెక్టివిటీ ని కూడా కలిగి ఉంటుంది.

 

2.       నోకియా D1C

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ తో నోకియా స్మార్ట్ ఫోన్ రంగం లో మళ్ళీ తన ఆధిక్యత ను ప్రదర్శించాలి అనుకుంటుంది. దీనిలో కూడా 13 MP కెమెరా LED ఫ్లాష్ తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ నౌగట్ పై ఇది పనిచేస్తుంది. 1.8 GHz పై పనిచేసే ఆక్టా కోర్ ప్రాసెసింగ్ సిస్టం ఇందులో ఉంటుంది. దీనివలన ఈ 4 జి డివైస్ అత్యుత్తమ పెర్ఫార్మన్స్ ను ఇస్తుంది.

 

3.       మోటో Z ఫోర్స్

ఈ ఫోన్ అనేక విశిష్టత లతో లభిస్తుంది. 4 GB RAM మరియు 32 GB మెమరీ ని కలిగిఉంటుంది. 21 MP కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్ప్లాష్ ప్రూఫ్ ఫీచర్ లు ఇందులో ఉంటాయి. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో పై ఇది పనిచేస్తుంది.

 

4.       LYFF 1 ప్లస్

5.5 ఇంచ్ డిస్ప్లే తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ 1.6 GHz పై పనిచేసే ఆక్టా కోర్ ప్రాసెసర్ ను కలిగిఉంటుంది. 16 MP కెమెరా తోనూ మరియు 32 GB మెమరీ తోనూ ఇది లభిస్తుంది. ఆండ్రాయిడ్ 6.0 వెర్షన్ పై ఇది పనిచేస్తుంది.

జన రంజకమైన వార్తలు