వేలి ముద్ర రక్షణ కవచంతో పెన్ డ్రైవ్ -ఎలెఫోన్ యు డిస్క్ ఎలిఫోన్ అనేది ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ. కానీ చూస్తుంటే ఇది తన రూట్ మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ తన తాజా ప్రకటన లో U-డిస్క్ రూపం లో తమ కొత్త ఉత్పాదన ఉండనుందని ప్రకటించింది. ఈ U-డిస్క్ అనేది ఒక ఫ్లాష్ డ్రైవ్ మరియు ఫింగర్ ప్రింట్ రీడర్ లతో కలిసి వస్తుంది. దీనిని సపోర్ట్ చేసే ఏ పరికరం లో నైనా దీనిని USB రూపం లో ప్లగ్ చేయవచ్చు. అంతే మీ ఫ్లాష్ డ్రైవ్ లో ఉన్న డేటా ను బయో మెట్రికల్ గా ఎన్ క్రిప్ట్ చేయబడిన ఫ్లాష్ డ్రైవ్ ద్వారా భద్ర పరచుకోవచ్చు. ఈ U-డిస్క్ అనేది రెండు విభాగాలుగా విభజించబడి ఉంటుంది. అవి ఒకటి పబ్లిక్, రెండవది ప్రైవేటు. పబ్లిక్ విభాగం ఎటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అవసరం లేకుండా ఎవరికైనా యాక్సెస బిలిటి ని కలిగి ఉంటుంది. ప్రైవేటు విభాగం మాత్రం దీనిని యాక్సెస్ చేయాలంటే దాని యజమాని యొక్క ఫింగర్ ప్రింట్ (వేలిముద్ర) ను అడుగుతుంది. అంటే ఎన్ క్రిప్ట్ అయిన డేటా ను మార్చాలన్నా ఓపెన్ చేయలన్నా దీని యజమాని యొక్క వేలిముద్ర తప్పనిసరి అన్నమాట. దీనికోసం ఈ U-డిస్క్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడిన USB ఫ్లాష్ డ్రైవ్ ఉంటుంది. దీని గురించి ఎలి ఫోన్ కంపెనీ ఇంతవరకు మాత్రమే ప్రకటించింది. దీని యొక్క మిగతా వివరాలు మరియు ధర మొదలైనవి ఇంకా తెలియవలసి ఉంది. చూడడానికి ఈ U-డిస్క్ ఒక మిశ్రమ లోహం తో తయారు చేయబడినట్లు కనిపిస్తుంది. ఈ పరికరం ఎన్ క్రిప్షన్ ను ఎలా హేండిల్ చేస్తుందీ ఈ ఎన్ క్రిప్షన్ ఎంత దృడం గా ఉండేదీ తెలియడం లేదు. ఇలాంటి పరికరాలను కొనే వారు ఎవరైనా తమ డేటా యొక్క రక్షణ గురించి చూసుకుంటారు. కాబట్టి ఈ విషయం లో ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాంటి వారికి ఒక మంచి ఎంపిక కాగలదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ల తో కూడిన USB పెన్ డ్రైవ్ లు కొంత కాలం గా అందుబాటులో ఉన్నప్పటికీ వాటిపై కొన్ని విమర్శలు ఉన్నాయి. కానీ ఈ U-డిస్క్ మాత్రం ఒక మంచి ఎంపిక కాగలదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. |