• తాజా వార్తలు

ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ చార్జింగ్ ల్యాప్‌టాప్‌

ల్యాప్ టాప్ ల తయారీలో నిత్యం కొత్త ప్రయోగాలు చేసే డెల్ తాజాగా మరో ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. హైఎండ్ స్మార్టు ఫోన్లలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న వైర్ లైస్ చార్జింగ్ ఫీచర్ ను తొలిసారి ల్యాప్ టాప్ లకు అందిస్తోంది డెల్.  లాటిట్యూట్ 7285 పేరిట విడుదలైన ఈ ల్యాప్‌టాప్‌ను యూజర్లు 2 ఇన్ 1 గా వాడుకోవచ్చు. ల్యాప్ టాప్ గా ట్యాబ్లెట్ గా రెండు రకాలుగా వాడుకునే వీలుంది.
    డెల్ లాటిట్యూడ్ 7285 ల్యాప్‌టాప్ 12, 13 ఇంచ్ వేరియెంట్లలో దొరుకుతోంది.  రెండింటిలోనూ 2880 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంది. 12 ఇంచ్ మోడల్ ధర రూ.77,261 ఉండగా, 13 ఇంచ్ మోడల్ ధర రూ.83,705 ఉంది. వీటికి అటాచ్ చేసుకునే విధంగా వైర్‌లెస్ చార్జింగ్ కీబోర్డ్ (ధర రూ.24వేలు), వైర్‌లెస్ చార్జింగ్ మ్యాట్ (ధర రూ.12వేలు), వైర్‌లెస్ చార్జింగ్ కీబోర్డ్ (ధర రూ.24వేలు)లు లభిస్తున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి ఇవి యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి.
    ఇవీ ఇతర స్పెసిఫికేషన్లు
* ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్
*  128/256 జీబీ హార్డ్ డిస్క్
* 8/16 జీబీ ర్యామ్

జన రంజకమైన వార్తలు