• తాజా వార్తలు

డెల్ హై ఎండ్ విండోస్ 10 ల్యాప్‌టాప్‌లు...

ల్యాప్ టాప్ లలో  2 ఇన్ 1 సౌకర్యం ట్యాబ్లెట్ గా, పీసీగా ఉపయోగకరం

డెల్ సంస్థ 'ఎక్స్‌పీఎస్ 13, ఎక్స్‌పీఎస్ 12'ల పేరిట రెండు నూతన హై ఎండ్ విండోస్ 10 ల్యాప్‌టాప్‌లను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇవి రెండు 'ఇంటెల్ స్కైలేక్ కోర్' ప్రాసెసర్లతో నడుస్తాయి. డెల్ ఎక్స్‌పీఎస్ 13 రూ.76,990 ధరకు లభిస్తుండగా, డెల్ ఎక్స్‌పీఎస్ 12 రూ.1,24,990 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

డెల్ ఎక్స్‌పీఎస్ 13 ల్యాప్‌టాప్‌లో 13.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ, హెచ్‌డీ వెబ్‌క్యామ్, విండోస్ 10 హోం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన మరో వేరియెంట్‌లో 6వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3200 X 1800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది రూ.1,34,990 ధరకు లభ్యమవుతోంది.

డెల్ ఎక్స్‌పీఎస్ 12 ల్యాప్‌టాప్‌లో 2 ఇన్ 1 సౌకర్యం ఉంది. దీన్ని ట్యాబ్లెట్ పీసీగానూ ఉపయోగించుకోవచ్చు. ఇది 4కె అల్ట్రాహెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఇంటెల్ కోర్ ఎం5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ, యూఎస్‌బీ 3.1 వంటి ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు